టెకీ శ్వేత ఆడియో టేపులు.. అజయ్ తల్లి, సోదరితో కాల్.. అయినా తీయకపోవడంతోనే...
హైదరాబాద్‌కి చెందిన సాప్ట్‌వేర్ ఇంజినీర్ శ్వేత ఆత్మహత్య ఘటనలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ప్రియుడు అజయ్ వేధింపులతో ఆమె బలవన్మరణానికి పాల్పడినట్టు తెలుస్తోంది. శ్వేత కుటుంబసభ్యులు ఆరోపణలతో అజయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణలో అజయ్ వల్లే శ్వేత ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే తాజాగా శ్వేత మాట్లాడిన ఆడియో టేపులు బయటకు వచ్చాయి. అందులో ఆమె చనిపోయేముందు మాట్లాడిన కాల్ కావడంతో ఎవరితో మాట్లాడారు..? ఏం మాట్లాడారు అనే ఉత్కంఠ నెలకొంది.

హత్య చేసి ఆత్మహత్యగా..?
అయితే శ్వేతను అజయ్ హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని ఆమె పేరంట్స్ అంటున్నారు. ఈ కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. కానీ ఆడియో టేపులు బయటకు రావడంతో మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. అందులో శ్వేత ఇద్దరితో మాట్లాడారు. అజయ్ తల్లి, సోదరితో మాట్లాడారని పోలీసులు తెలిపారు. అందులో తన ఫోటోలను సోషల్ మీడియోలో అప్ లోడ్ చేశారని.. వాటిని తీయడం లేదని శ్వేత వాపోయారు. ఇదే విషయం వారిద్దరితో శ్వేత తన గోడును వెల్లబోసుకుంది.

ఫోటోలు షేర్ చేయడంతో..
అయినా వారు వినిపించుకోలేదు. అజయ్‌కి చెప్పారో లేదో తెలియదు గానీ.. ఆమె సన్నిహితంగా ఉన్న ఫోటోలు అలానే ఉన్నాయి. దీంతో శ్వేత తీవ్ర మనో వేదనకు గురయ్యారు. పేరంట్స్‌కి చెప్పుకోలేక.. తనలో తాను కుమలిపోయారు. ఏం చేయలేని దిక్కుతోచని పరిస్థితుల్లో చివరకు రైలుకి ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఆమె సూసైడ్‌పై మొదట్లోనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. తర్వాత వారి అనుమానాలే నిజమవుతోన్నాయి. ఒక్కో విషయం వెలుగులోకి వస్తోంది. అజయ్ వేధింపుల వల్లే చనిపోయినట్టు తెలుస్తోంది.

ప్రేమ పేరుతో మోసం..
ప్రేమించినట్టు నటించి అజయ్ మోసం చేశాడని శ్వేత పేరంట్స్ తెలిపారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. వంచించారని పేర్కొన్నారు. శ్వేత పిరికిది కాదు అని.. అని బ్లాక్ మెయిల్ చేయడంతో బలవన్మరణానికి పాల్పడిందని వెల్లడించారు. ఫోటోలు షేర్ చేయడంతో తీవ్ర ఒత్తిడికి గురయ్యిందని వారు చెబుతున్నారు. శ్వేత పేరంట్స్ చెబుతోన్న అంశాలు.. ఆడియో టేపుల సంభాషణల ఆధారంగా పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో అజయ్ ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్నాడు.

సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు..
అజయ్ వేధింపులపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశామని శ్వేత పేరంట్స్ చెబుతున్నారు. వారు స్పందించకపోవడంతో దారుణం జరిగిందని తెలిపారు. కానీ శ్వేత పేరంట్స్ ఆరోపణలపై సంబంధిత పోలీసులు స్పందించలేదు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications