హైదరాబాద్‌లో కాల్పుల కలకలం: జువెల్లరీ షాపులో బంగారం చోరీ, ఇద్దరికి తీవ్రగాయాలు
హైదరాబాద్: నగరంలో మరోసారి కాల్పుల కలకలం సంచలనంగా మారింది. నాగోల్ స్నేహపురికాలనీలోని ఓ నగల షాపులో ఇద్దరు దుండగులు తుపాకీతో కాల్పులు జరిపారు. షాపు జయమానిని బెదరించారు. దుకాణంలోని బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఈ ఘటన గురువారం రాత్రి 9.20 నిమిషాల ప్రాంతంలో జరిగింది.
మూడు రౌండ్లు కాల్పులు జరపడంతో షాపులోని ఇద్దరికి బుల్లెట్ గాయాలయ్యాయి. వారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ముగ్గురు దుండగులు నగలు ఆభరణాలు ఇవ్వాలని డిమాండ్ చేయగా.. నిరాకరించడంతో కాల్పులకు తెగబడ్డారు. షాపు యజమాని కళ్యాణ్ సింగ్‌కు తీవ్రగాయాలయ్యాయి.

మహదేవ్ జువెల్లరీ షాపులో జరిగిన ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రాథమిక వివరాలను సేకరించి దర్యాప్తు మొదలుపెట్టారు. సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలను ఆధారంగా చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
షాపులో పడిన బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దుండగులు ఎటు నుంచి వచ్చారు.. ఎటు వెళ్లారనేదానిపై సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజీలను కూడా పోలీసు పరిశీలిస్తున్నారు. కాల్పులకు పాల్పడిన దుండగుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.
షెటర్లు మూసివేసి దుండగులు ఈ దారుణానికి తెగబడ్డారని ప్రత్యక్ష సాక్షి చెప్పారు. పల్సర్, యాక్టివా ద్విచక్ర వాహనాల్లో వచ్చారని తెలిపారు. షెటర్ తెరిచేసరి తమను తోసుకుని పరారయ్యారని స్థానికులు చెప్పారు. కాల్పుల ఘటనతో ఆందోళనకు గురయ్యామని చెప్పారు. షాపుపై పక్కా రెక్కీ నిర్వహించిన తర్వాతే ఈ దోపిడీకి దుండగులు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications