హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Hyderabad News: జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, రోడ్ నెంబర్ 45కు వెళ్తున్నారా.. అయితే ఈ వార్త చదవాల్సిందే..

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ మహానగరం రోజురోజుకు శరవేగంగా విస్తరిస్తుంది. అదే స్థాయిలో జనాభా పెరుగుతుంది. అదే స్థాయిలో వాహనాలు కూడా పెరుగుతున్నాయి. కానీ చాలా చోట్లు రోడ్లు మాత్రం విస్తరించడం లేదు. దీంతో వాహనదారులకు తిప్పలు తత్పపట్లేదు. ముఖ్యంగా పీక్ అవర్స్ వాహనదారులు గంటలకొద్ది రోడ్లపై ఉండాల్సి వస్తుంది. ముఖ్యంగా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్ ప్రాంతాల్లో పీక్ అవర్స్ భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. అయితే పలు చోట్ల ట్రాఫిక్ డైవర్షన్ వల్ల ట్రాఫిక్ తగ్గే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.

వారం రోజుల పాటు

వారం రోజుల పాటు


అందులో భాగంగా జూబ్లీహిల్స్ లో శుక్రవారం నుంచి ట్రాఫిక్ ​ను దారి మళ్లిస్తున్నట్లు సిటీ ట్రాఫిక్ చీఫ్ ఏవీ రంగనాథ్ వెల్లడించారు. శుక్రవారం నుంచి వారం రోజుల పాటు అంటే గురువారం వరకు ట్రయల్ రన్ నిర్వహిస్తామని ఆయన చెప్పారు. ఇలా ట్రాఫిక్ సమస్య తగ్గితే దీన్ని కొనసాగిస్తామని.. లేకుంటే మార్పులు చేస్తామన్నారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్టు, రోడ్ నం.45, జర్నలిస్టు కాలనీ మార్గాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు వాహనాలను దారి మళ్లీస్తున్నట్లు వివరించారు.

బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12

బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12


ఈ వారం రోజుల పాటు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 నుంచి జూబ్లీహిల్స్ చెక్​ పోస్టు రోడ్ నం.45 మీదుగా వెళ్లేలేరు. మీరు జూబ్లీహిల్స్ చెక్​ పోస్టు వెళ్లాలంటే జగన్నాథ టెంపుల్ సర్కిల్ వద్ద రైట్ తీసుకుని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి, కేబీఆర్ పార్కు చెక్ పోస్టుకు వెళ్లాలి. అలాగే జూబ్లీహిల్స్ చెక్ పోస్టు నుంచి దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి వైపు వెళ్లే వాహనాలను రోడ్ నెంబర్36 మీదుగా మెట్రో పిల్లర్ నం. 1650, రోడ్ నెంబర్ 54 మీదుగా మళ్లిస్తున్నారు.

కేబుల్ బ్రిడ్జి

కేబుల్ బ్రిడ్జి


ఫిల్మ్ నగర్ నుంచి చెక్ పోస్టుకు వెళ్లే వాహనదారులు రోడ్ నెంబర్ 45 వద్ద లెఫ్ట్ తీసుకుని హార్ట్ కప్ కేఫ్ నుంచి కేబుల్ బ్రిడ్జి కింద యూటర్న్ తీసుకుని చెక్ పోస్టుకు వెళ్లొచ్చు. కేబుల్ బ్రిడ్జి నుంచి వచ్చే వాహనదారులు జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వెళ్లాలంటే రోడ్ నెంబర్ 45 నుంచి కాకుండా రోడ్ నెంబర్ 54 లో లెఫ్ట్ తీసుకుని రోడ్ నెంబర్ 36 ఫ్రీడమ్ పార్క్ నుంచి మెట్రో పిల్లర్ నం. 1663 వద్ద యూటర్న్ తీసుకొని చెక్ పోస్టుకు చేరుకోవచ్చు. ఫిల్మ్ నగర్ నుంచి ఒమేగా హాస్పిటల్, బంజారాహిల్స్ రోడ్ నం.12 వైపు వెళ్లేవారు జర్నలిస్ట్ కాలనీ వద్ద యూటర్న్ తీసుకుని ఫిల్మ్ నగర్ జంక్షన్ మీదుగా వెళ్లాలి.

గీతా ఆర్ట్స్ ఆఫీస్

గీతా ఆర్ట్స్ ఆఫీస్


కేబుల్ బ్రిడ్జి నుంచి బీఎన్ఆర్ హిల్స్, ఖాజాగూడ, ఫిల్మ్ నగర్ జంక్షన్ కు వెళ్లేవారు రోడ్ నెంబర్45లోని హార్ట్ కప్ కేఫ్ వద్ద యూ టర్న్ తీసుకుని.. గీతా ఆర్ట్స్ ఆఫీస్ నుంచి రోడ్ నెంబర్.51, పక్షి సర్కిల్, న్యాయవిహార్‌‌‌‌ నుంచి ఎడమ వైపునకు వెళ్లి ఫిల్మ్ నగర్ జంక్షన్ కు వెళ్లొచ్చు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్12, ఫిల్మ్ నగర్ జంక్షన్ నుంచి వచ్చే వాహనాలు రోడ్ నెంబర్45 మీదుగా కాకుండా ఫిల్మ్ నగర్ రోడ్ ఎడమవైపునకు వెళ్లి భారతీయ విద్యాభవన్ వద్ద యూటర్న్ తీసుకొని ఫిల్మ్ నగర్ జంక్షన్ వద్ద ఎడమవైపు నుంచి జర్నలిస్ట్ కాలనీ/రోడ్ నం. 45 వెళ్లాల్సి ఉంటుంది.

English summary
City Traffic Chief AV Ranganath revealed that the traffic is being diverted from Friday in Jubilee Hills. He said that a trial run will be conducted for a week from Friday till Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X