నకిలీ స్టిక్కర్లు: పోలీసుల విసృత తనిఖీలు..
సిటీలో నెగ్లిజెన్సీ ఎక్కువ అయ్యింది. అవును చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నారు. ఫేక్ స్టిక్కర్లతో తిరిగేస్తున్నారు. దీంతో నగరంలో ట్రాఫిక్ పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. ప్రధాన కూడళ్లలో వాహనాలను ఆపి క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ప్రతి ఒక్క వాహనం కాకుండా.. స్టిక్కర్లు ఉన్న వాటిని మాత్రం ఆపి తనిఖీలు చేస్తున్నారు. ఇటీవలే దొంగ స్టిక్కర్లు అంటించుకుంటూ వాహనాలు దూసుకెళుతున్న సంగతి తెలిసిందే.
ఎమ్మెల్యే పేరుతో ఉన్న కారు బీభత్సానికి ఓ చిన్నారి మరణించిన సంగతి తెలిసిందే. ఈ కారు ఎమ్మెల్యే షకీల్ పేరుతో ఉందని తేలింది. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. శనివారం రాత్రి భారీగా ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగారు. ప్రెస్, ఆర్మీ, పోలీస్, ఎమ్మెల్యే స్టిక్కరింగ్ ఉన్న వాహనాలను ఆపుతున్నారు. వాహనం వారిదేనా ? కాదా ? అనే దానిపై ఆరా తీస్తున్నారు. దొంగ స్టిక్కర్స్ అంటించుకుని తిరుగుతున్న వాహనాలపై నిఘా పెడుతున్నారు.

జూబ్లీ హిల్స్ లో కారు ప్రమాద కేసులో పురోగతి సాధించారు పోలీసులు. డ్రైవింగ్ చేసింది సయ్యద్ ఆఫ్నాన్ గా నిర్ధారించారు. స్థానికులు, బాధితుల సమాచారం ఆధారంగా నిందితుడిని గుర్తించారు. ఆప్నాన్ తో పాటు రసూల్ ను అదుపులోకి తీసుకున్నారు. జూబ్లీహిల్స్ కారు ప్రమాదం కేసు అనేక మలుపులు తిరుగుతోంది. అసలు ఏం జరుగుతుందో, నేరస్థులెవరో తెలియని అయోమయం నెలకొంది. పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసినా.. వారే ఆ కారు నడిపారా..? లేక ఇంకా ఎవరినైనా తప్పించడానికి వీరిని అరెస్టు చేశారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కారు యాక్సిడెంట్ కేసులో.. మీర్జా, అతని కుమారుడిని అరెస్టు చేసినట్టు చెబుతున్నారు. ప్రమాదం జరిగినప్పటి నుంచి ఎమ్మెల్యే షకీల్ కామెంట్స్ అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. గురువారం రాత్రి 8 గంటల 45 నిమిషాలకు ప్రమాదం జరిగింది. ఆ కారుపై ఎమ్మెల్యే స్టిక్కర్ చూసి, షకీల్‌కు ఫోన్ చేశారు పోలీసులు. గంటన్నర తర్వాత, ఆ కారు తనకు తెలిసిన దూరపు వాళ్లదని చెప్పాడు షకీల్. ఆ తర్వాత.. అది తన ఫ్రెండ్ కారని మాట మార్చారు. ఆ తర్వాతేమో.. మీర్జా ఇన్‌ఫ్రా పేరుతో, తన ఫ్రెండ్ కారు తీసుకున్నాడని చెప్పారు. అసలు కారులో ఎంతమంది ఉన్నారనేది ఇప్పటికీ మిస్టరీగానే మారింది.
-
హైదరాబాద్ లో దంచికొడుతున్న భారీ వర్షం.. -
ఏపీ, తెలంగాణాకు కార్మికులకు గండంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం! -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications