స్వాతంత్ర్య దినోత్సవానికి సిద్ధమైన గోల్కొండ కోట: సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్: 75వ భారత స్వాతంత్ర్య వేడుకలకు గోల్కొండ కోట సిద్దమైంది. ఆదివారం (ఆగస్టు 15న) స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఎగురవేయనున్నా నేపథ్యంలో అధికారులు అక్కడ ఏర్పాట్లు పూర్తి చేశారు. తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్, పోలీసు ఉన్నతాధికారులు గోల్కొండ కోటలో ఏర్పాట్లను పరిశీలించారు.
పంద్రాగస్టు వేడుకల సందర్భంగా గోల్కొండ కోటపై 120 అదనపు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటిని బషీర్‌బాగ్‌లోని పోలీసు కమిషనరేట్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్(సీసీసీ)లో అనుసంధానించింది. స్థానిక పోలీస్ స్టేషన్, గోల్కొండ కోట వద్ద ఉన్న కంట్రోల్ రూంలోనూ దృశ్యాలను చూసేలా ఏర్పాటు చేశారు. ఈ తాత్కాలిక సీసీ కెమెరాల పనితీరుపై సీసీసీ అధికారులు శుక్రవారం ట్రయల్ రన్ నిర్వహించి, అన్ని సరిగ్గా పనిచేస్తున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు.

నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో హైదరాబాద్ నగర వ్యాప్తంగా భారీ బందోబస్తు, గస్తీ నిర్వహిస్తున్నారు. గోల్కొండ కోటలోకి ప్రవేశించే ప్రతి ద్వారం దగ్గర డోర్ ఫ్రేమ్, మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు తనిఖీలు చేయనున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కరోనా నిబంధనలు పాటించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
స్వాతంత్ర్య వేడుక నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో ఆదివారం పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
ఆదివారం ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కో ట వైపునకు వాహనాలకు అనుమతి లేదు.
రాందేవ్‌గూడ నుంచి కోటకు ఎ, బి, సి, పాస్ హోల్డర్స్ వాహనాలకే అనుమతి.
కింద్రాబాద్, బంజారాహిల్స్, మాసబ్‌ట్యాంక్, మెహిదీపట్నం నుంచి వచ్చే పాస్ హోల్డర్లు రేతిబౌలి,నానల్‌నగర్ జంక్షన్ నుంచి లంగర్‌హౌస్ ఫ్లైఓవర్, టిప్పు ఖాన్ బ్రిడ్జి, రాందేవ్‌గూడ జంక్షన్ మీదుగా రావాలి.
మక్కై దర్వాజ వద్ద ఎ- కారు పాస్ హోల్డర్లు మెయిన్ రోడ్డు పక్కన,
బి- పాస్ హోల్డర్లు గోల్కొండ కోట బస్టాప్ వద్ద,
సి- కారు పాస్ హోల్డర్లు గోల్కొండ బాయ్స్ గ్రౌండ్ ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో పార్క్ చేయాలి.
డి- పాస్ హోల్డర్లు ప్రియదర్శిని స్కూల్ వద్ద వాహనాలను పార్క్ చేయాలి.
ఇ- కారు పాస్ హోల్డర్లు సెవన్ టూంబ్స్ బంజారా దర్వాజ మీదుగా రేతిగల్లిలోని ఒౖవైసి గ్రౌండ్‌లో వాహనాలను పార్క్ చేయాలి.
ఇక లంగర్‌హౌస్ మీదుగా వచ్చే ఇ- పాస్ హోల్డర్లు బడాబజార్, బల్దియా ఐలాండ్ మీదుగా ఒవైసి గ్రౌండ్‌కు వెళ్లాలి. ఎఫ్- కారు పార్క్ హోల్డర్లు లంగర్‌హౌస్ మీదుగా ఫతే దర్వాజ నుంచి హుడా పార్కు వద్ద వాహనాలను పార్క్ చేయాలి.
షేక్‌పేట్, టోలిచౌకికి చెందిన వారు బంజారా దర్వాజ నుంచి ఆర్టీసి బస్సుల ద్వారా కోటకు చేరుకోవాలి.
వేడుకలు పూర్తయిన తర్వాత ఏ,బీ,సీ- కారు పాస్ హోల్డర్లు మక్కై దర్వాజ, రాందేవ్‌గూడ, లంగర్‌హౌస్ నుంచి వెళ్లాలి. డి కారు పాస్ హోల్డర్లు బంజారదర్వాజ మీదుగా సెవన్ టూంబ్స్ వైపు వెళ్లాలి.
ఇ- కారు పాస్ హోల్డరు బడాబజార్, ఫతే దర్వాజ గుండా వెళ్లాలి. ఎఫ్- కారు పాస్ హోల్డర్లు తమ తమ పార్కింగ్ ప్రదేశాల నుంచి వచ్చిన మార్గం గుండానే వెనక్కి వెళ్లిపోవాలి. అన్ని రకాల పాస్ హోల్డర్లు తమ పాస్‌ను తమ కారుపై డిస్‌ప్లే చేయాలి.
-
అలా చేస్తే శాశ్వతంగా నష్టపోతాం -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా












Click it and Unblock the Notifications