Hydra: హైడ్రా ఇంత ఆగం ఎందుకు.. గంట కూడా టైమ్ ఇవ్వలేరా..!
వన్ ఇండియా తెలుగు ఎక్స్ క్లూజివ్: తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ లోని చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాలను రక్షించే లక్ష్యంతో హైడ్రాను ఏర్పాటు చేసింది. కమిషనర్ గా ఐపీఎస్ రంగనాథ్ ను నియమించింది. దీంతో హైడ్రా చెరువుల్లోని బఫర్, ఎఫ్టీఎల్ లో ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చేశాయి. అయితే కొంత మంది బిల్డర్లు.. చెరువులు కబ్జా చేసి అపార్ట్ మెంట్లు కట్టారు. వాటిని మధ్యతరగతి వారికి విక్రయించారు. దీంతో వారు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఓ ప్రకటన చేశారు.
బఫర్, ఎఫ్టీఎల్ ఉన్న మధ్యతరగతి వారి నిర్మాణాలను ముట్టుకోమని చెప్పారు. చెరువు బఫర్, ఎఫ్టీఎల్ లో ఉన్న వాణిజ్య కట్టడాలు, కొత్తగా నిర్మిస్తూన్న నిర్మాణాలను మాత్రమే కూల్చివేస్తామని రంగనాథ్ స్పష్టం చేశారు. తాజాగా ఆదివారం కూకట్ పల్లిలోని నల్ల చెరువు బఫర్, ఎఫ్టీఎల్ లో ఉన్న వాణిజ్య కార్యాకాలాపాలు కొనసాగిస్తున్న నిర్మాణాలను హైడ్రా పడగొట్టింది. ఇవన్నీ తాత్కాలిక నిర్మాణాలే. అయితే ఇక్కడే నివాసం ఉంటున్న ఇళ్లను మాత్రం హైడ్రా ముట్టుకోలేదు. కేవలం కమర్షియల్ కాంప్లెక్స్ మాత్రమే హైడ్రా కూల్చివేసింది.

అంతా బాగానే ఉంది. కానీ ఇక్కడ హైడ్రా కాస్త మానవత్వంతో వ్యవహరిస్తే బాగుండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. నల్ల చెరువును కొంత మంది రాజకీయ నాయకులు, బడా వ్యాపారులు ఆక్రమించారు. భూములు తమ పేరుపై రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. చిన్న వ్యాపారాలు చేసుకుని ఉపాధి పొందడం కోసం మధ్య తరగతి ప్రజలు సదరు ఓనర్ల వద్ద భూమిని లీజ్ కు తీసుకున్నారు. అందులో లక్షలు పెట్టి తాత్కాలిక షేడ్లు వేసుకున్నారు. వ్యాపారం చేసుకుంటూ పది మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఇందులో చాలా మంది అప్పులు చేసి, బ్యాంకు లోన్లు తీసుకుని వ్యాపారం ప్రారంభించారు.
ఆదివారం సడెన్ గా హైడ్రా అధికారులు వచ్చి నిర్మాణాలను కూల్చివేశారు. దీంతో బాధితులు తమకు కాస్త సమయం ఇచ్చి ఉంటే బాగుండేదని.. నిర్మాణాల్లోని వస్తువులను తీసుకునే వారమని బాధితులు చెబుతున్నారు. ఓ మహిళ కన్నీరు పెట్టుకుంటూ.. కనీసం గంట సమయం ఇవ్వాలని అడిగినా.. హైడ్రా అధికారులు సమయం ఇవ్వలేదని చెప్పారు. తమకు శనివారం సాయంత్రమే సమాచారం ఇచ్చారని వాపోయారు. మరోవైపు తము నోటీసులు ఇచ్చామని హైడ్రా పేర్కొంది. ఈ ఘటనలో చెరువు కబ్జా చేసి లీజ్ కు ఇచ్చిన ఓనర్లు లాభం పొందారు. కష్టాన్ని నమ్ముకున్నవారు అన్యాయం అయిపోయారు.
వారికి ప్రభుత్వం న్యాయం చేయడంతో పాటు.. బడా బాబులకు భూమి రిజిస్ట్రేషన్ చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వస్తున్నాయి.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications