చర్చలపై ఐఏఎస్‌లు అబద్దాలు : ఆర్టీసీ జేఏసీ
ఆర్టీసీ అధికారులతో జరిగిన చర్చలు అర్థంతంగా ముగిసిన విషయం తెలిసిందే.. అయితే చర్చల్లో భాగంగా ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నారు. చర్చల్లో అర్థంతరంగా కార్మికులే వెళ్లిపోయారని చర్చల్లో పాల్గోన్న ఐఏఎస్ అధికారుల బృందం ప్రకటించింది. అయితే అధికారులు అబద్దాలు చెబుతున్నారని, తాము ఎప్పుడు చర్చలు పిలిచినా రావడానికి సిద్దంగా ఉన్నామని ఆర్టీసీ జేఏసీ నాయకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే అధికారులు అబద్దాలు చెబుతున్నారని కార్మిక నాయకులు విమర్శించారు.

ఐఏఎస్‌లు అబద్దాలు అడుతున్నారు అర్టీసీ ఐకాస
ఈ నేపథ్యంలోనే కార్మిక నేతలతో జరిగిన చర్చలపై అధికారులు అబద్దాలు చెబుతున్నారని ఆర్టీసీ కన్వినర్ అశ్వధ్దామ రెడ్డి అన్నారు. అధికారులు నిర్బంధం మధ్య చర్చలు జరిపారని అన్నారు. చర్చల సంధర్బంగా తాము మధ్యలో వెళ్లిపోలేదని ,చర్చల్లో నుండి అధికారులే వెళ్లిపోయారని చెప్పారు. ఈ నేపథ్యంలోనే బాద్యతతో ఉన్న ఐఏఎస్ అధికారులు అబద్దాలు చెప్పవద్దని ఆయన కోరారు. ఈ నేపథ్యంలోనే సమ్మెపై చర్చించేందుకు తాము ఎప్పుడైన సిద్దంగా ఉన్నామని స్పష్టం చేశారు. 28 కోర్టు ప్రారంభమయ్యో లోపు పిలిచినా తాము వెళ్లడానికి సిద్దంగా ఉన్నామని అన్నారు. ఈ నేపథ్యంలోనే సమ్మె యధావిధంగా కొనసాగుతుందని 30న జరిగే సమరభేరీని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

కార్మిక సంఘాలు మధ్యలోనే వెళ్లిపోయారు.. ఐఏఎస్‌లు
అయితే విలీనం కార్మిక సంఘాలు పట్టుబట్టాయని, వాటి అంగీకరించక పోవడంతో కార్మిక సంఘాలు మళ్లి వస్తామని చెప్పి మధ్యలోనే వెళ్లిపోయారని చర్చల్లో పాల్గోన్న ఆర్టీసీ ఇంచార్జీ ఎండీ సునిల్ శర్మతోపాటు రవాణశాఖ కమీషనర్ సందీప్ సుల్తానీయా కలిసి చర్చల అనంతరం మీడీయాకు వివరించారు. అయితే చర్చల సంధర్భంగా తాము సంయమనంతో వ్యవహరించామని అయినా వారు మళ్లి వస్తామని చెప్పారని తిరిగి సాయంత్రం వరకు రాలేదని వారికి చర్చల సంధర్భంగా మూడు అవకాశాలు ఇచ్చామని చెప్పారు.

సోమవారం కోర్టులో వాదనలు
మొత్తం మీద కార్మికులతో మరోసారి చర్చలు జరిగే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు. ఆదివారం దీపావళీ మరియు సెలవు దినం కావడంతో ఇరు వర్గాలు స్థబ్దుగానే వ్యవహరించే అవకాశాలు ఉన్నాయి. దీంతో సోమవారం కోర్టులో ఇరువర్గాలు మరోసారి వాదనలు వినిపించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇరువర్గాలు ఆర్టీసీ సమ్మెపై వ్యుహత్మకంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో తమ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే కోర్టు సీరియస్‌గా జోక్యం చేసుకుంటే తప్ప పరిష్కారం లభించే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటి వరకు రెండు సార్లు ఆర్టీసీ సమ్మె వాదనలు విన్న కోర్టు ఇరువురుని మందలిస్తూ కొన్ని సలహాలు, సూచనలు మాత్రమే చేసింది. కాని ఎలాంటీ పరోగతి మాత్రం కనిపించడం లేదు. దీంతో కోర్టులో తదుపరి జరిగే వాదనల్లో ఎలాంటీ ఆదేశాలు ఇస్తుందో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications