హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తప్పు చేస్తే నడిరోడ్డుపై నిలబెట్టి కొట్టండి: జీవితా రాజశేఖర్

|
Google Oneindia TeluguNews

తనతోపాటు తన కుటుంబ సభ్యులెవరైనా ఎవరినైనా మోసం చేయడం చూశారా? అంటూ సినీ నటి, నిర్మాత జీవితా రాజశేఖర్ ప్రశ్నించారు. సోషల్ మీడియాలో తనపై వచ్చే కథనాలు మరెవరిపై రావంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఫిలిం చాంబర్ సభ్యులతో కలిసి గురువారం ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. జీవితతోపాటు నిర్మాతలు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, తమ్మారెడ్డి భరద్వాజ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జీవిత మాట్లాడుతూ మీడియా తనని ఎంతగానో ఆదరిస్తోందని, సినిమా షూటింగ్స్, ఇతరత్రా పనుల్లో బిజీగా ఉంటుంటామని, ఏదైనా సమస్య వస్తే మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతుంటానన్నారు. అయినప్పటికీ తమ కుటుంబంపై వచ్చినన్ని వార్తలు మరెవరిమీదా రాలేదని వాపోయారు.

గరుడవేగ నిర్మాతలు కోటేశ్వరరాజు, హేమ తమపై ఆరోపణలు చేశారని, ఆ సినిమాకు వారు కొంత మొత్తమే ఖర్చుపెట్టారని, ఆస్తులమ్మి తాము డబ్బు తెచ్చి సినిమాకు ఖర్చుపెట్టి విడుదల చేశామన్నారు. తీరా సినిమా విడుదలైన తర్వాత వచ్చిన డబ్బు మొత్తం వాళ్లే తీసుకున్నారని, ఇన్ని సంవత్సరాల తర్వాత రాజశేఖర్, జీవిత రూ.26 కోట్లు ఎగ్గొట్టారని, మోసం చేశారంటున్నారని, ఈ వార్తను మీడియా నాలుగు రోజులు ప్రసారం చేసిందని, కోటేశ్వరరాజు, హేమ మాకు బ్లాంక్ చెక్ చూపించారు అని చెప్పారు. కోర్టులో కేసు నడుస్తోందని, త్వరలోనే అన్ని వివరాలు బయటకు వస్తాయన్నారు.

If you make a mistake, stand on the road and hit: Jeevita Rajasekhar latest comments

తన కుమార్తెలపై వార్తలు రాశారని, వ్యక్తిగత జీవితానికి ఇబ్బంది కలిగేలా రాయొద్దని విజ్ఞ‌ప్తి చేశారు. దయచేసి తమ కష్టాలను అర్థం చేసుకోవాలని జీవిత కోరారు. రు. తప్పుచేస్తే నడిరోడ్డుపై మమ్మల్ని నిలబెట్టి కొట్టండని, ఇలాంటి వార్తలవల్ల ఇబ్బంది పడుతున్నామన్నారు. వీటిపై న్యాయ పోరాటం చేయొచ్చుకానీ అంత సమయం, డబ్బు అందరి దగ్గరా ఉండవన్నారు.

అనంతరం నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు మాట్లాడుతూ ఓటీటీలు వచ్చిన తర్వాత వందరకాల సమస్యలు వస్తున్నాయని, వాటిపై ఎవరికీ నియంత్రణ లేకుండా పోయిందన్నారు. ఓటీటీలో సినిమా ప్రదర్శించినరోజే యూట్యూబ్ లో పైరసీ వీడియో వస్తోందన్నారు. ఫిలిం చాంబర్ కు సంబంధించిన యాంటీ పైరసీ విభాగం ఇప్పుడు వేరేవారి చేతిలో ఉందని, డబ్బున్నవారికే ఈ సెల్ పనిచేస్తోందని ఆరోపించారు. పైరసీని అరికట్టడంలో ఛాంబర్ పాత్ర ఏమీ లేదని, నిర్మాతల మండలి సమావేశంలో చేసే తీర్మానాలు ఒకలా ఉంటాయని, అమల్లో మరోలా ఉంటాయన్నారు. నిర్మాతల మండలి అనేది కొందరి చేతుల్లోకి వెళ్లిపోయిందన్నారు. ఓటీటీలపై కేంద్రం సెన్సార్ కూడా ఉండాలని ఆదిశేషగిరిరావు డిమాండ్ చేశారు.

English summary
jeevitha rajasekhar comments on garudavega producers..
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X