కరోనా ఫ్రీగా భారత్, ప్రధాని మోడీకి థాంక్స్: బండి సంజయ్
ప్రజలందరికీ ఉచిత వ్యాక్సిన్ వేస్తామని ప్రకటించిన ప్రధాని నరేంద్రమోడీకి తెలంగాణ ప్రజల తరపున బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధన్యవాదాలు తెలిపారు. ప్రజల ఆరోగ్యం గురించి మోడీ ప్రభుత్వం ఎంతటి ప్రాధాన్యం ఇస్తుందో ఈ నిర్ణయం బట్టి అర్థం చేసుకోవచ్చని తెలిపారు. ఇది దేశ హితం కోసం ప్రధాని మోడీ మరోసారి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని బండి సంజయ్ కొనియాడారు.
కరోనా వైరస్ నుంచి దేశ ప్రజలను కాపాడటమే కేంద్ర ప్రభుత్వ తొలి ప్రాధాన్యం అని మోడీ ప్రకటించారని తెలిపారు. ఎంత ఖర్చయిన సరే దేశ ప్రజలకు వ్యాక్సిన్ వేయించడమే తన లక్ష్యం అని మోడీ ప్రకటించారని వివరించారు. ఇదీ ఆయన గొప్పతననానికి నిదర్శనం అని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం సపోర్ట్‌తో దేశంలో ఇప్పటికే మేడి ఇన్ ఇండియా ద్వారా రెండు వ్యాక్సిన్లు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు.

ప్రజలందరికి ఉచిత వ్యాక్సినేషన్ పై ప్రధాని తీసుకున్న నిర్ణయంతో దేశం కరోనా ఫ్రీ భారత్‌గా మారడం ఖాయమన్నారు. కేవలం రాష్ట్రాలు కోరినందుకే 18 ఏళ్లు పైబడిన వాళ్ల కోసం ఇన్నాళ్లు 25 శాతం వ్యాక్సిన్‌ను రాష్ట్రాలకు అప్పగించారని తెలిపారు. తెలంగాణ లాంటి రాష్ట్రాలు కేంద్రంపై విమర్శలు చేయడం తప్ప, తమ విధిని కూడా సక్రమంగా నిర్వర్తించలేకపోయాయని విమర్శించారు. దేశంలో మొత్తం ప్రజలందరికి ఫ్రీ వ్యాక్సినేషన్ చేయిస్తామని కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవడం గొప్ప నిర్ణయమని బండి సంజయ్ తెలిపారు.
ఈ నెల 21వ తేదీ నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందజేస్తామని ప్రధాని మోడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బండి సంజయ్ ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టారు. వ్యాక్సిన్ గురించి రాద్దాంతం చేస్తుందే తప్ప.. మరేం కాదని ఫైరయ్యారు.












Click it and Unblock the Notifications