Hyderabad: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. ఆ నగరాలకు నేరుగా విమాన సర్వీసులు..!

హైదరాబాద్ వాసులకు శుభవార్త. హైదరాబాద్ నుంచి కొత్తగా విమాన సర్వీసులు ప్రారంభం అయ్యాయి. ఇండిగో ఎయిర్‌లైన్స్ హైదరాబాద్ విమానాశ్రయం నుంచి కొత్త డైరెక్ట్ ఫ్లైట్‌లను ప్రారంభించింది. సెప్టెంబర్ 28న విమానయాన సంస్థ హైదరాబాద్ నుంచి ప్రయాగ్‌రాజ్, ఆగ్రాలకు డైరెక్ట్ విమానాలను నడుపుతోంది. దేశీయ విమాన ప్రయాణానికి కీలకమైన కేంద్రంగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మారుతుందని చెబుతున్నారు. ఇండిగో ఎయిర్‌లైన్స్ ఆరు నగరాలకు డైరెక్ట విమాన సర్వీసులు నడిపిస్తోంది.

హైదరాబాద్ నుంచి నేరుగా అగర్తల, కాన్పూర్, ఆగ్రా, జమ్మూ, ప్రయాగ్‌రాజ్, అయోధ్య విమాన సర్వీసులు నడుస్తోన్నాయి. హైదరాబాద్ నుంచి ప్రయాగ్ రాజ్ కు శనివారం విమాన సర్వీస్ ప్రారంభమైంది. విమానం ఉదయం 8:55 గంటలకు బయలుదేరి 10:50 గంటలకు ప్రయాగ్‌రాజ్‌కి చేరుకుంటుంది. అలాగే హైదరాబాద్ ఆగ్రాకు నేరుగా విమానాలు నడుస్తున్నాయి. ఈ విమానాలు వారానికి మూడు రోజులు నడుస్తాయి. ఆగ్రా విమానం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి మధ్యాహ్నం 1:55 గంటలకు బయలుదేరి సాయంత్రం 4:05 గంటలకు ఆగ్రా చేరుకుంటుంది.

Indigo has started direct flights from Hyderabad to six cities in the country

అలాగే కాన్పూర్ కూడా హైదరాబాద్ నుంచి విమానాలు నడుస్తోన్నాయి. ఈ విమాన సర్వీస్ వారానికి నాలుగు రోజులు కొనసాగుతాయి. ఈ విమానం హైదరాబాద్ శంషాబాద్ ఎయరి్ పోర్ట్ నుంచి ఉదయం 8:55 గంటలకు బయలుదేరి ఉదయం 11:00 గంటలకు కాన్పూర్ చేరుకుంటారు. హైదరాబాద్ నుంచి అయోధ్యకు కూడా నేరుగా విమానాలు నడుస్తోన్నాయి. ఈ విమానం కూడా వారంలో నాలుగు రోజులు అందుబాటులో ఉంటుంది. ఈ విమానం మధ్యాహ్నం 1:55 గంటలకు బయలుదేరి సాయంత్రం 4 గంటలకు అయోధ్యకు చేరుకుంటుంది.ఈ వమానం సోమ, బుధ, శుక్రవారాలు, ఆదివారం నడుస్తుంది.

హైదరాబాద్ నుంచి అగర్తలకు కూడా విమాన సర్వీసులు కొనసాగుతోన్నాయి. ఈ విమానం వారానికి 4 రోజులు అందుబాటులో ఉంటుంది. విమానాలు ఉదయం 7:30 గంటలకు బయలుదేరి 10:20 గంటలకు అగర్తలకు చేరుకుంటుంది. అలాగే హైదరాబాద్ నుంచి జమ్మూకు కూడా నేరుగా విమానాలు నడుస్తోన్నాయ. ఈ విమానం వారానికి మూడు రోజులు అదుబాటులో ఉంటుంది. శంషాబాద్ నుంచి ఉదయం 7:05 గంటలకు బయల్దేరి ఉయం 10:10 గంటలకు జమ్మూ చేరుకుంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+