Indiradevi: మహా ప్రస్థానంలో ఇందిరాదేవి అంత్యక్రియలు..
సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, మహేష్ బాబు తల్లి ఘట్టమనేని ఇందిరాదేవి అంత్యక్రియలు జూబ్లీహిల్స్ లోని మహా ప్రస్థానంలో ముగిశాయి. అంత్యక్రియల్లో ఘట్టమనేని కృష్ణ కుటుంబసభ్యులు, పలువురు సినీ తారలు పాల్గొని ఇందిరాదేవికి వీడ్కోలు పలికారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఇందిరాదేవి గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఉదయం 4 గంటలకు
బుధవారం ఉదయం 4 గంటలకు ఆమె పరిస్థితి విషమించటంతో కన్నుమూశారు. కుటుంబ సభ్యులు, అభిమానుల సందర్శన కోసం ఇందిరాదేవి పార్థివదేహాన్ని మధ్యాహ్నం 12 గంటల వరకు పద్మాలయ స్టూడియోలో ఉంచారు. ఇందిరాదేవి మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

ప్రముఖుల నివాళులు
హీరో మోహన్ బాబు, వెంకటేశ్, నాగార్జున, విజయ్ దేవరకొండ, దగ్గుబాటి రానా, గోపి చందు, విష్ణు డైరెక్టర్లు త్రివిక్రం, కొరటాల శివ, సుకుమార్, నిర్మాత అశ్వినీదత్ ఇందిర పార్ధీవ దేహానికి నివాళులర్పించారు. కృష్ణ, మహేష్ బాబును కలిసి ధైర్యం చెప్పారు.

ఐదుగురు సంతానం
కృష్ణ-ఇందిరాదేవి దంపతులకు ఐదుగురు సంతానం ఉన్నారు. రమేశ్ బాబు, మహేశ్ బాబు, పద్మావతి, మంజుల, ప్రియదర్శిని.. కాగా.. కొద్ది రోజల క్రితం మహేష్ సోదరుడు రమేష్ బాబు చనిపోయారు. కృష్ణ-ఇందిరాదేవికి 1961 వివాహం జరిగింది. కృష్ణ 1992లో విజయనిర్మలను రెండో పెళ్లి చేసుకున్నారు.
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications