International Women's Day: ఆడ పిల్ల అని చదువేందుకన్నారు.. కానీ ఈ రోజు లోకో పైలట్ అయింది..
ప్రపంచంలో మహిళలు వాహనాలు నడపడానికి అనుమతించని ఏకైక దేశంగా సౌదీ అరేబియా ఉండేది కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. వాహనాలే కాదు, మహిళలు కూడా ఇప్పుడు సౌదీ అరేబియాలో తొలిసారిగా రైళ్లను నడుపుతున్నారు. భారతీయ మహిళా లోకో పైలట్ ఇందిరా ఈగలపాటి సౌదీ అరేబియాలో రైలు నడపుతున్నారు. ఏపీలోని గుంటూరుకు చెందిన ఇందిరా ఈగలపాటి హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ప్రస్తుతం ఈమె రియాద్ మెట్రో రైలులో పైలట్ గా పని చేస్తున్నారు.
అంతకుముందు ఇందిర హైదరాబాద్ మెట్రోలో 3 సంవత్సరాలు పనిచేశారు. ఆమె మొత్తం 15,000 కి.మీ. నడిపారు.ఐటి ఇంజనీరింగ్ పోస్ట్-గ్రాడ్యుయేట్, ఆమె స్నేహితులు సాఫ్ట్‌వేర్ రంగంలో స్థిరపడినప్పటికీ, ఆమె స్వదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా రైళ్లు నడపడం ద్వారా విభిన్నంగా ఉండాలనుకున్నారు.

తన చిన్నతనంలో మెకానిక్ పని చేసే తండ్రికి పనిముట్లు, విడిభాగాలను అందించేదానిదని ఇందిరా చెప్పారు. తను ఇప్పుడు ప్రపంచంలోని అత్యంత అధునాతన రైళ్లలో ఒకటిగా నడుపుతున్నానని ఇందిర వివరించారు. "మేము ముగ్గురు సోదరీమణులం. మా నాన్న ఆడపిల్లల విద్యకు చాలా ప్రాముఖ్యతనిచ్చారు, అయినప్పటికీ మా బంధువులు కొందరు మాకు సోదరులు లేరు కాబట్టి కట్నం కోసం పొదుపు చేయకుండా విద్యపై ఖర్చు చేయడాన్ని వ్యతిరేకించారు" అని ఇందిరా చెప్పారు.
"నేను రియాద్ మెట్రోకు ఎంపికైనప్పుడు, రైలు పైలట్‌గా పనిచేయడానికి ఒంటరి మహిళ సౌదీ అరేబియాకు ఎలా వెళ్తుందో అని మా బంధువులు చాలా మంది భయపడిపోయారు, నా సంకల్పం నన్ను నిరోధించలేదు. నేను సౌదీకి వెళ్లాను" అని ఇందిర తెలిపారు. విజన్ 2030లో భాగంగా సౌదీ అరేబియాలో మహిళా సాధికారతతో ఆమె తన సౌదీ మహిళా సహోద్యోగులను ప్రశంసలతో ముంచెత్తింది. ఇందిరకు వివాహమైంది, ఆమె భర్త కూడా ఖతార్‌లో లోకో పైలట్‌గా పనిచేస్తున్నాడు.












Click it and Unblock the Notifications