హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇంటర్ అకడమిక్ ఇయర్ కన్ఫామ్.. ఎగ్జామ్స్ డేట్స్ కూడా

|
Google Oneindia TeluguNews

తెలంగాణలో ఇంటర్ మీడియట్ విద్యా సంవత్సరం ఖరారైంది. ఆన్ లైన్ తరగతులతో కలిసి మొత్తం 220 పని దినాలు కేటాయించారు. ఇంటర్ పరీక్షల నిర్వహణలో కూడా కీలక మార్పులు చేసింది. హాఫ్ ఇయర్, ప్రి ఫైనల్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. దసరా, ఆదివారంతో కలిపి 5 రోజులు, సంక్రాంతికి జనవరి 13వ తేదీ నుంచి 15 వరకు సెలవులు ఉంటాయని వెల్లడించింది. 17వ తేదీన ఆదివారం కావడంతో 18వ తేదీ నుంచి క్లాసులు ప్రారంభం కానున్నాయి.

డిసెంబర్ 13 నుంచి డిసెంబర్ 18వ తేదీ వరకు హాఫ్ ఇయర్ పరీక్షలు నిర్వహిస్తారు. ఫిబ్రవరి 10వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ప్రి ఫైనల్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు.
ఫిబ్రవరి 23వ తేదీ నుంచి మార్చి 15వ తేదీ వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు ఉంటాయి. మార్చి 23వ తేదీ నుంచి ఇంటర్ వార్షిక పరీక్షలు నిర్వహిస్తారు. మే లాస్ట్ వీక్ లో అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయి. ఏప్రిల్ 14వ తేదీ నుంచి మే 31 వరకు వేసవి హాలీడేస్ ఇస్తారు.జూన్ 01వ తేదీ నుంచి ఇంటర్ కాలేజీలు పున:ప్రారంభం అవనుంది.

telangana inter academic year started. exam date also confirm by officials.

ఇటు వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆందోళన నెలకొంది. మరోవైపు వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.

వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది. మొత్తానికి కరోనాతో కలిసి బతకాల్సిందే.. అందుకోసం విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే. రెండు డోసులతోపాటు బూస్టర్ డోస్ టీకా కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే అందరికీ సెకండ్ డోసు ఇస్తున్నారు. ఇది పూర్తయితే దేశంలో చాలా మంది రెండు డోసులు తీసుకున్నట్టు అవుతుంది. దీంతోపాటు బూస్టర్ డోసు వేసుకోవాలని నిపుణులు సూచన చేస్తున్నారు.

ఇటు డేల్టా వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. డేల్టా ప్లస్ వేరియంట్ మరింత ప్రమాదకరం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దీంతో కరోనా కోసం మరింత పకడ్బందీగా ఉండాల్సిందే. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు.

English summary
telangana inter academic year started. exam date also confirm by officials.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X