ఇంటర్‌లో తప్పిన ఇద్దరు విద్యార్థుల బలవన్మరణం.. ఒత్తిడి వల్లేనా..?
తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదల కాగా.. విద్యార్థులు కలత చెందుతున్నారు. కొందరు అయితే ఏకంగా ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఎప్పటి లాగే ఈ సారి ఇంటర్ ఫలితాలు వెలువడగానే ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇంటర్‌లో ఫెయిల్ అయ్యామనే మనస్థాపంతో నల్గొండకు చెందిన జాహ్నవి, నిజామాబాద్‌కు చెందిన ధనుష్ తమ ప్రాణాలను తీసుకున్నారు.

సబ్జెక్టు తప్పితే..
నల్గొండకు చెందిన జాహ్నవి ఇంటర్‌లో ఒక సబ్జెక్ట్ తప్పింది. తనకిక జీవితమే లేదనుకుంది. అర్థాంతరంగా జీవితాన్ని ముగించింది. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఫలితాలు విడుదలయ్యాక తాను ఒక సబ్జెక్ట్‌లో ఫెయిల్ అయినట్టు తెలుసుకుంది. ఇదే విషయాన్ని ఇంట్లో వారికి చెప్పింది. తల్లిదండ్రులతో ఏం జరిగింది? ఎందుకు ఫెయిల్ అయ్యావు? అంటూ జాహ్నవిని ప్రశ్నించారు. దీంతో ఏం సమాధానం చెప్పలేకపోయింది. తనలో తానే కుమిలిపోయింది. బాగానే చదివే తను ఎందుకు ఫెయిల్ అయ్యాననే ప్రశ్న వెంటాడిందో ఏమో అందరూ పడుకున్నాక రైల్వే ట్రాక్‌పైకి వెళ్లి ఆత్మహత్య చేసుకుంది.

గుండె కోత
జాహ్నవి మృతితో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.. జాహ్నవి బాగా చదువుతుందని.. కానీ ఎందుకు ఫెయిల్ అయ్యిందో అర్థం కావడం లేదని కుటుంబ సభ్యులు అంటున్నారు. రాత్రి వరకు తమతోనే ఉందని.. తెల్లారి లేచే సరికి జాహ్నవి కనిపించలేదన్నారు. తన కోసం వెతుకుతుండగానే రైల్వే ట్రాక్‌పై జాహ్నవి మృతదేహం ఉందనే సమాచారం వచ్చిదని రోదించారు.

ఇందూరులో
నిజామాబాద్‌కు చెందిన ధనుష్ కూడా ఇదే కారణంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటర్‌లో ఫెయిల్ అయ్యాననే మనస్థాపంతో సూసైడ్ చేసుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ధనుష్ మృతితో వారి ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఒత్తిడి వల్లే
పిల్లలపై మార్కుల ఒత్తిడి వల్లే ఇలా జరుగుతోందని నిపుణులు అంటున్నారు. తక్కువ మార్కులు వచ్చినా, ఫెయిల్ అయినా నలుగురిలో పరువు పోతుందనో, స్నేహితులు హేళన చేస్తారనో, తల్లిదండ్రులు తిడతారనో.. ఇలాంటి భయాలతో తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరోవైపు ఈ సారి ఇంటర్ ఫలితాల్లో కేవలం 49 శాతం మాత్రమే ఉత్తీర్ణత శాతం నమోదవ్వడం కూడా వివాదస్పదమైంది. ఇంటర్ బోర్డు కఠిన వైఖరి వల్లే ఈ దుస్థితి వచ్చిందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఫెయిలైన విద్యార్థుల పేపర్లను ఉచితంగా రీ వాల్యూయేషన్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి..
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications