ప్రతి ఒక్కరి గుండెలోనూ టీడీపీ: తెలంగాణలో తెలుగుదేశం పాత్రపై చంద్రబాబు ఇలా
ఇటీవల ఖమ్మం సభ విజయవంతం కావడంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించారు.
హైదరాబాద్: తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పూర్వ వైభవం కోసం ఆ పార్టీ అధిష్టానం గట్టిగానే ప్రయత్నిస్తోంది. ఇటీవల ఖమ్మం సభ విజయవంతం కావడంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించారు. తాజాగా, హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్ టీటీడీపీ నిర్వహించిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని ప్రారంభించి.. తెలంగాణ టీడీపీ శ్రేణులకు చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు.
తెలంగాణలో ప్రతి ఒక్కరి గుండెలోనూ టీడీపీ: చంద్రబాబు
తెలంగాణలోని ప్రతి ఒక్కరి గుండెల్లో తెలుగుదేశం పార్టీని పెట్టుకుంటారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇక్కడికి వచ్చి చూస్తే టీడీపీ ఎక్కడుందో కనిపిస్తోందన్నారు. ఎన్టీఆర్ తెలంగాణ గడ్డపైనే టీడీపీని ఏర్పాటు చేశారన్నారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు టీడీపీని స్థాపించారన్నారు. 41 ఏళ్లుగా తెలుగువాళ్ల కోసం పనిచేస్తున్న పార్టీ తెలుగుదేశమని వ్యాఖ్యానించారు.
తెలంగాణలో తెలుగుదేశం పాత్రపై చంద్రబాబు
పేదవాళ్ల కోసం సంక్షేమ పథకాలు అమలు చేసిన పార్టీ టీడీపీ అని చంద్రబాబు చెప్పారు. సంక్షేమ పథకాలు టీడీపీతోనే ప్రారంభమయ్యాయన్నారు. పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దు చేసి పేదవారికి ఎన్టీఆర్ స్వాతంత్ర్యం అందించారన్నారు. రైతుల కోసం భూమి శిస్తు రద్దు చేశారని తెలిపారు. మహిళలకు సాధికారత కల్పించింది ఎన్టీఆరేనని గుర్తు చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్ లో మౌలిక వసతులు కల్పించామన్నారు. హైదరాబాబ్‌లో సైబర్ టవర్ నిర్మించిన ఘటన తెలుగుదేశం పార్టీదేనని చంద్రబాబు అన్నారు.

ప్రపంచంలోని తెలుగువారి కోసమే టీడీపీ అంటూ చంద్రబాబు
దేశంలో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చింది తెలంగాణ బిడ్డ పీవీ నర్సింహారావు అని చెప్పారు. తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఉంది అనేవారికి ఖమ్మం సభ సమాధానం చెప్పిందన్నారు. ప్రపంచంలో తెలుగువారు ఎక్కడున్నా వారి కోసం టీడీపీ పనిచేస్తుందన్నారు. సృష్టించిన సంపదను పేదవాళ్లకు అందించడమే లక్ష్యమన్నారు. ప్రజల్లో ఉండాలనే సంకల్పం అందరూ తీసుకోవాలని టీడీపీ శ్రేణులకు చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. మే 28న ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తామని ప్రకటించారు చంద్రబాబు. ఎన్టీఆర్‌కు భారతరత్న అనేది ప్రతి తెలుగువాడి ఆకాంక్ష అని, అది దేశానికి గౌరవమని వ్యాఖ్యానించారు. కాగా, తెలంగాణలో టీడీపీ బలోపేతం చేసేందుకు ఇంటింటికి టీడీపీ అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే. కాసాని జ్ఞానేశ్వర్ టీటీడీపీ బాధ్యతలు తీసుకుని ముందుకు నడిపిస్తున్నారు. ఇతర పార్టీల్లో చేరిన రేవంత్ రెడ్డి సహా టీడీపీ నేతలు తిరిగి పార్టీకి రావాలని ఆయన కోరుతుండటం గమనార్హం.
-
హైదరాబాద్ ను మించి అమరావతి నిర్మాణం చేస్తామన్న సీఎం చంద్రబాబు! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల..












Click it and Unblock the Notifications