• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఇరువైపులా దాడి... చిక్కుకుపోయిన రేవంత్.. తెగేదాకా లాగుతున్నారా..?

|

తన టార్గెట్ ముఖ్యమంత్రి పదవే అని మల్కాజ్‌గిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ గతంలో పలుమార్లు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే కాంగ్రెస్ లాంటి మహా సముద్రంలో సీనియర్లను కాదని రేవంత్ నెగ్గుకురాగలరా.. అని ఆయన పార్టీలో చేరిన కొత్తలో చాలామంది సందేహాలు వెలిబుచ్చారు. ఆ సందేహాలన్నీ నిజమవుతూనే ఉన్నాయి. టీపీసీసీ పదవి విషయంలో ఇప్పటికే ఆయనకు సీనియర్ల సెగ తగిలింది. రేవంత్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పదవి ఇవ్వవద్దని చాలామంది సీనియర్లు హైకమాండ్‌కు విజ్ఞప్తి చేశారు. ఇక తాజాగా డ్రోన్ కేసు వ్యవహారంలోనూ రేవంత్‌పై సొంత పార్టీ నుంచే విమర్శల దాడి మొదలైంది. దీంతో అటు అధికార పార్టీ,ఇటు సొంత పార్టీ దాడితో రేవంత్ సతమతమవుతున్నారన్న వాదన వినిపిస్తోంది.

ఘాటుగా స్పందిస్తున్న సీనియర్లు

ఘాటుగా స్పందిస్తున్న సీనియర్లు

రేవంత్ వ్యవహారంపై ఇటీవల సీనియర్ నేతల విమర్శల దాడి పెరిగింది. ముఖ్యంగా సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి,సీనియర్ నేతలు వీహెచ్,దామోదర రాజనరసింహ వంటి వారు రేవంత్‌పై బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. పార్టీని కేవలం కుంతియా,రేవంత్ మాత్రమే నడిపిస్తున్నారన్నట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని.. దాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తాజాగా జగ్గారెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. ఆ ఇద్దరే పార్టీని నడిపిస్తే.. ఇక తాము ఇంట్లో కూర్చోవాలా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఎవరి జాగీరు కాదని ఘాటుగా స్పందించారు. ఏదైనా సరే.. కోర్ కమిటీ సమావేశం పెట్టి చర్చించాలని.. అప్పుడు పులులు,సింహాలు ఎవరో తేలుతుందని అన్నారు. అటు వీహెచ్ కూడా రేవంత్ తీరును తప్పు పట్టారు. పార్టీలో తానొక్కడినే పోరాడుతున్నానని చెప్పుకోవడం సరికాదన్నారు. అంతేకాదు,గతంలో రేవంత్ ఇందిరా,సోనియా గాంధీలపై చేసిన వ్యాఖ్యలను తాము ఇప్పటికీ మరువలేదని గుర్తుచేశారు.

ఉత్తమ్ వర్సెస్ రేవంత్

ఉత్తమ్ వర్సెస్ రేవంత్

కాంగ్రెస్ సీనియర్ నేతలంతా ఇప్పటికీ ఉత్తమ్ నాయకత్వం పట్ల సానుకూలంగా ఉన్నారు. టీపీసీసీగా కొనసాగుతున్న ఉత్తమ్‌తోనూ సంప్రదించకుండా 111జీవో విషయంలో ఎలా ముందుకెళ్లారని వారు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు,బెయిల్‌పై విడుదలై బయటకొచ్చాక ఉత్తమ్‌పై రేవంత్ చేసిన విమర్శలు వారికి మరింత మంట పుట్టించాయి. ఉత్తమ్ వ్యక్తిత్వం ఉన్న నేత అని.. ఆయన్ను టార్గెట్ చేయడం సరికాదని జగ్గారెడ్డి రేవంత్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఫేస్‌బుక్ లైక్‌లు వేరు,ఓటు బ్యాంకు రాజకీయం వేరని వ్యాఖ్యానించారు. అటు వీహెచ్ కూడా 111జీవో విషయంలో రేవంత్ ఎవరినీ సంప్రదించకుండానే కేటీఆర్‌పై పోరాటానికి దిగాడని.. ఇక్కడ వ్యక్తిగత ఎజెండాలు పనిచేయవని చెప్పారు. డ్రోన్ కెమెరాలతో ఫోటోలు తీయడమే రేవంత్ తప్పేనని చెప్పారు. ఇలా ఉత్తమ్ వర్సెస్ రేవంత్‌గా మారిన రాజకీయంలో సీనియర్లంతా ఉత్తమ్ వైపే నిలబడుతున్న పరిస్థితి.

తెగేదాకా లాగుతున్నారా..

తెగేదాకా లాగుతున్నారా..

అటు అధికార పార్టీ దూకుడు,ఇటు సొంత పార్టీ నేతల మద్దతు లేకపోవడంతో రేవంత్ సతమతమవుతున్నారన్న వాదన వినిపిస్తోంది. కేటీఆర్ ఫామ్ హౌజ్ వివాదంపై కాంగ్రెస్ కోర్ కమిటీలో చర్చించి ఉంటే బాగుండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జైలు నుంచి విడుదలయ్యాక కూడా ఆయన ఉత్తమ్‌ను టార్గెట్ చేస్తూ మాట్లాడటం సీనియర్లతో మరింత ఎడం పెంచే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే సీనియర్లతో గ్యాప్ కారణంగా పార్టీలో విమర్శలు ఎదుర్కొంటున్న రేవంత్.. ఆ గ్యాప్‌ను మరింత పెంచేలా వ్యవహరిస్తుండటం ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందోనన్న చర్చ కాంగ్రెస్‌లో చర్చ జరుగుతోంది.

ఒకరకంగా రేవంత్ సీనియర్లతో సఖ్యత కంటే వారితో విభేదాలను తెగేదాకా లాగుతున్నారన్న విమర్శలు కూడా పార్టీలో అంతర్గతంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌లో రేవంత్ భవితవ్యం ఎలా ఉండబోతుంది.. ఒకవేళ హైకమాండ్ ఆయనకు అనుకూలంగా ఉన్నా.. ఇక్కడి సీనియర్లు సహకరిస్తారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

  Good News! Central Govt Announce 3 Medical Colleges In AP
  రూట్ మారుస్తారా.. లేక..

  రూట్ మారుస్తారా.. లేక..

  అధికార పార్టీపై పోరాటంలో తానొక్కడే పోరాడుతున్నట్టు సోషల్ మీడియాలో రేవంత్ ప్రచారం చేసుకుంటున్నాడని సీనియర్ నేతలు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. జైల్లో ఉన్నప్పుడు కనీసం పరామర్శకు కూడా ఉత్తమ్ తన వద్దకు రాలేదని రేవంత్ అంటుంటే.. కేటీఆర్ ఫామ్ హౌజ్ వివాదం వ్యవహారంలో అసలు పార్టీని ఎందుకు సంప్రదించలేదని సీనియర్లు ప్రశ్నిస్తున్నారు. సహజంగానే దూకుడైన నేతగా ప్రజల్లో రేవంత్‌కు ఆదరణ ఉన్న మాట నిజమే కానీ.. అన్నింటికంటే కాంగ్రెస్ విధానాలే ముఖ్యమని గుర్తుచేస్తున్నారు. పార్టీతో సంప్రదింపులు జరగకుండా చేసే కార్యక్రమాలకు సొంత ఎజెండా అనే ముద్ర పడక తప్పదని పరోక్షంగా హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ ఇప్పటికైనా రేవంత్ సీనియర్లతో కలిసి ముందుకు సాగుతారా.. లేక పాత దారిలోనే వెళ్తారా అన్నది వేచి చూడాలి.

  English summary
  In the latest drone case, criticism has begin from Revanth's own party.The ruling party and his own party are attacking Revanth over that.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more