హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మంత్రి మల్లారెడ్డికి మరో షాక్ : ఐటీ అధికారుల లేఖ కలకలం - రంగంలోకి..!!

|
Google Oneindia TeluguNews

Minister Mallareddy: మంత్రి మల్లారెడ్డి కేంద్ర దర్యాప్తు సంస్థలు వెంటాడుతున్నాయి. వరుసగా మూడు రోజుల పాటు ఐటీ అధికారులు నిర్వహించిన సోదాలతో రాజకీయంగా కలకలం చోటు చేసుకుంది. సోదాల తరువాత ఐటీ అధికారులు మల్లారెడ్డి కుటుంబ సభ్యులు..విద్యా సంస్థల్లో సిబ్బందిని విచారిస్తున్నారు. ఇదే సమయంలో మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. ఇప్పటి వరకు సోదాలు - విచారణ చేసిన ఆదాయపు ఐటీ అధికారులు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కు లేఖ రాసినట్లు తెలుస్తోంది. అందులో పేర్కొన్న అంశాలు మంత్రి మల్లారెడ్డికి షాక్ గా మారుతున్నాయి.

ఆదాయపు పన్ను శాఖ లేఖ..

ఆదాయపు పన్ను శాఖ లేఖ..

మంత్రి మ‌ల్లారెడ్డి నివాసంతో పాటుగా ఆయన బంధువుల నివాసాల్లోని ఐటీ అధికారులు సుదీర్ఘ సోదాలు నిర్వహించారు. కుమార్తె - కుమారుడు- అల్లుడుతో పాటుగా బంధువుల నివాసాలు- కార్యాలయాల్లోనూ ఈ సోదాలు జరిగాయి. పెద్ద మొత్తంలో న‌గ‌దును, బంగారంతో పాటుగా కీల‌క ప‌త్రాల‌ను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై ప్ర‌స్తుతం ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు మంత్రి కుటుంబాన్ని, స‌న్నిహితులు, కార్యాల‌యాల్లో ప‌నిచేస్తున్న వారిని విచారిస్తున్నారు. కాగా, మ‌ల్లారెడ్డి సంస్థల్లో సోదాల సమయంలో తాము గుర్తించిన అక్రమాల పైన ఐటీ అధికారులు ఈడీకి లేఖ రాయటం కలకలం రేపుతోంది. మ‌ల్లారెడ్డి విద్యాసంస్థ‌ల్లో ఫీజులు వ‌సూలుపై ఐటీ షాకిచ్చింది. దీనికి సంబంధించి అక్రమాలు జరిగినట్లు ఆధారాలను సేకరించినట్లుగా తెలుస్తోంది.

ఈడీ విచారణ కోరుతూ సమాచారం..

ఈడీ విచారణ కోరుతూ సమాచారం..

మంత్రి మల్లారెడ్డి విద్యా సంస్థల్లో నిర్వహించిన సోదాల్లో ప్రధానంగా ఫీజలు వసూలు పైనే అధికారులు ఫోకస్ పెట్టారు. అక్రమాలు జరిగినట్లుగా గుర్తించారని చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం విచారణ సమయంలోనూ ఆరా తీస్తున్నారు. దీంతో, మనీ లాండరింగ్ జరిగిందనే కోణంలో ఐటీ అధికారులు ఈడీకి లేఖ రాసారని సమాచారం. మల్లారెడ్డి కుటుంబ సభ్యుల లాకర్లు నుంచి రూ 18 కోట్లు నగదు..కీలక పత్రాల స్వాధీనం చేసుకున్న అధికారులు..ఫీజలు విషయంలో తాము కోరని సమాచారం పైన స్పష్టత రాలేదని లేఖలో వివరించినట్లు తెలుస్తోంది. దీని పైన ఈడీ మరింత లోతుగా విచారణ చేయటం ద్వారా మరిన్ని కీలక అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉందని సూచించినట్లు సమాచారం. దీంతో, ఇప్పుడు ఈ లేఖ పైన ఈడీ ఏ రకంగా స్పందిస్తుందనేది తెలియాల్సి ఉంది.

సీట్లు - డొనేషన్లలో అవకతవకలు

సీట్లు - డొనేషన్లలో అవకతవకలు

మల్లారెడ్డి విద్యా సంస్థల్లో సీట్ల కేటాయింపు..డొనేషన్ల స్వీకరణ లో అవకతవకలు జరిగాయనేది ఐటీ అధికారుల అభియోగం. దీనికి సంబంధించి కొంత సమాచారం సేకరించినా..లోతైన అధ్యయనం అవసరమని భావిస్తున్నారు. దీంతో, ఇప్పుడు ఐటీ అధికారుల లేఖ ఆధారంగా ఈడీ విచారణ చేయాల్సి ఉంటుంది. ఐటీ అధికారుల లేఖ ఆధారంగా ఈడీ రంగంలోకి దిగేముందే నోటీసులు ఇచ్చే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలోని టీఆర్ఎస్ నేతలే లక్ష్యంగా అనేక అంశాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణ సాగుతున్న సమయంలో..తాజాగా మల్లారెడ్డికి సంబంధించి ఐటీ అధికారులు రాసిన లేఖ కలకలం రేపుతోంది. ఇప్పుడు మల్లారెడ్డి వ్యవహారంలో ఈడీ స్పందన ఏంటనేది స్పష్టత రావాల్సి ఉంది.

English summary
As per Reports IT Officials letter to Enforcement Directorate to inestigate Malla Reddy Educational istututions fee collections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X