రాహుల్ గాంధీకి మరో షాక్.. జైలులో ములాఖాత్‌కు నో పర్మిషన్
కాసేపట్లో ఓరుగల్లులో రైతు సంఘర్షణ సభ జరగనుంది. ఇందుకు సంబంధించి నేతలు ఏర్పాట్లు చేశారు. ఇవాళ, రేపు తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ ఉంటారు. ఇవాళ వరంగల్‌లో సభ జరగనుంది. రేపు ఓయూలో విద్యార్థులతో భేటీకి వర్సిటీ వీసీ పర్మిషన్ ఇవ్వలేదు. అయితే జైలులో ఉన్న ఎన్ఎస్‌యూఐ నేతలను కలిసేందుకు జైళ్ల శాఖ అనుమతించలేదు. రెండు విషయాలకు సంబంధించి రాహుల్ గాంధీకి చుక్కెదురు అయ్యింది.
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి తెలంగాణ రాష్ట్రంలో మరో షాక్ తగిలింది. ఇప్పటికే ఓయూలో విద్యార్థులను కలిసే వీసీ అనుమతి ఇవ్వని సంగతి తెలిసిందే. రేపు చంచల్ గూడ జైలులో ఉన్న ఎన్ఎస్ యూఐ నేతలతో ములాఖత్ అయ్యేందుకు అనుమతి కోరారు. కానీ అందుకు జైలు అధికారులు పర్మిషన్ ఇవ్వలేదు. దీంతో వరసగా రెండు అంశాలకు సంబంధించి రాహుల్ గాంధీకి నిరాశ తప్పలేదు.

ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్ధులతో రాహుల్ సమావేశానికి యూనివర్సిటీ అధికారులు అనుమతి ఇవ్వలేదు. దీంతో ఎన్ఎస్‌యూఐ నాయకులు నిరసనకు దిగారు. వీరిని పోలీసులు అరెస్ట్ చేశారు. చంచల్ గూడ జైలుకు తరలించారు. రెండు రోజుల తెలంగాణ పర్యటనకు వస్తున్న రాహుల్ గాంధీ జైలులో ఉన్న నేతలతో సమావేశం అయ్యేందుకు కాంగ్రెస్ నాయకులు అనుమతి కోరారు. తాజాగా జైలు అధికారులు నిరాకరించారు. దీనిపై రాష్ట్ర కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.
ఓరుగల్లు సభలో రాహుల్ గాంధీ కీలక అంశాలపై మాట్లాడతారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. వ్యవసాయానికి సంబంధించి తీర్మానాలు ప్రవేశపెడతారని చెబుతున్నారు. పంట కొనుగోలు, మద్దతు ధర గురించే ప్రకటన చేసే అవకాశం ఉంది. రైతులను ఆకట్టుకునేందుకు రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్నారు. వారిని ఓటు బ్యాంకుగా మార్చుకుందామని అనుకుంటున్నారు. మరీ రియాలిటీ ఏం జరుగుతుందో చూడాలీ.. మరీ.












Click it and Unblock the Notifications