హైదరాబాద్‌కు జయరాం హత్య కేసు నిందితులు: శిఖాచౌదరితో సంబంధంపై పనిమనిషి నుంచి ఆరా!

హైదరాబాద్: ఎన్నారై వ్యాపారవేత్త జయరాం హత్య కేసులో నిందితులైన రాకేష్ రెడ్డి, శ్రీనివాస్‌లని నందిగామ నుండి పిటి వారెంట్ పైన హైదరాబాద్‌కు తరలించారు. ఏపీ నుంచి తీసుకు వచ్చిన జూబ్లీహిల్స్ పోలీసులు
నాంపల్లి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. న్యాయమూర్తి నిందితులకు ఈ నెల 25 వరకు జ్యూడిషియల్ కస్టడీ విధించారు. వీరిని చంచల్ గూడ జైలుకు తరలించారు.

రేపు రాకేష్ రెడ్డి, శ్రీనివాస్‌ల కస్టడీ కోసం జూబ్లీహిల్స్ పోలీసులు పిటిషన్ దాఖలు చేయనున్నారు. నిందితులిద్దరిపై వారం రోజుల కస్టడీ పిటిషన్ వేసే అవకాశముంది.

Jayaram murder case: Accused sent to 14 days judicial custody

ఇదిలా ఉండగా, జయరాం హత్య కేసులో శిఖాచౌదరి పని మనిషి, వాచ్‌మెన్, స్నేహితులను జూబ్లీహిల్స్ పోలీసులు విచారించారని తెలుస్తోంది. శిఖా చౌదరి, జయరాం మధ్య ఉన్న సంబంధాల పై విచారణ సాగినట్లుగా చెబుతున్నారు. ఓ రహస్య ప్రాంతంలో వీరిని పోలీసులు విచారించారని వార్తలు వస్తున్నాయి. త్వరలోనే శిఖా చౌదరికి పోలీసులు నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాలని ఆదేశించే అవకాశముంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+