జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు: నిందితులతో సీన్ రీకన్ స్ట్రక్చన్ చేసిన పోలీసులు
హైదరాబాద్: జూబ్లీహిల్స్ గ్యాంగ్‌రేప్ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఐదుగురు మైనర్లు, ఏ1 సాదుద్దీన్ ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు. విచారణలో భాగంగా ఆదివారం నిందితులను ఘటనా స్థలానికి తీసుకెళ్లి సీన్ రీకన్‌స్ట్రక్చన్ చేస్తున్నారు.
అమ్నేషియాపబ్, కాన్సూ బేకరీ, జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 36,44 తదితర ప్రాంతాలకు నిందితులను తీసుకెళ్లారు. ఘటన జరిగిన పోలీసులు తెలుసుకుంటున్నారు. ఈ కేసులో ప్రధాన నిందిడిగా ఉన్న సాదుద్దీన్ ను జూన్ 10 నుంచి జూబ్లీహిల్స్ పోలీసులు కస్టడీకిలోకి తీసుకుని విచారిస్తున్నారు.

సాదుద్దీన్ చెప్పిన వివరాల ఆధారంగా మైనర్లను కూడా ప్రశ్నిస్తున్నారు. దీనిలో భాగంగానే వారిని సీన్ రీకన్ స్ట్రక్షన్‌కు తీసుకెళ్లారు. ఘటన జరిగిన రోజు నిందితులు వ్యవహరించిన తీరుపై సీన్ రీ-కన్‌స్ట్రక్షన్ చేసి పలు వివరాలు తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే నిందితులను పెద్దమ్మ తల్లి దేవాలయం సమీపంలోని నిర్మానుష్య ప్రదేశం, కేబీఆర్ పార్క్, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లోని కన్సూ బేకరి వద్ద సీన్ రీ-కన్‌స్ట్రక్షన్ నిర్వహించారు.
జూబ్లీహిల్స్ రోడ్ 36, 44లలోనూ పరిశీలించారు.అనంతరం నిందితులను జూబ్లీహిల్స్ పీఎస్‌కు తరలించారు. నిందితులను సాయంత్రం 5 గంటల వరకు పోలీసులు ప్రశ్నించనున్నారు. ప్రధాన నిందితుడు సాదుద్దీన్ చెప్పిన వివరాల ఆధారంగా ఈ ఐదుగురిని ప్రశ్నించనున్నారు. కాగా, ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సాదుద్దీన్ కస్టడీ నేటితో ముగిసింది.
-
మందుబాబులకు బిగ్ షాక్.. రేపు వైన్ షాప్ లు బంద్.. -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!!











Click it and Unblock the Notifications