హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మోడీ నుంచి దేశాన్ని.. కేసీఆర్ నుంచి రాష్ట్రాన్ని కాపాడాలి, ఫామ్ హౌస్ ఇష్యూపై కేఏ పాల్

|
Google Oneindia TeluguNews

కేఏ పాల్ ఇటీవల చాలా యాక్టివ్ అయ్యారు. మునుగోడు బరిలో ఇండిపెండెంట్‌గా కూడా ఉన్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు డ్యాన్సులు కూడా చేస్తున్నారు. అయితే మొయినాబాద్ ఫామ్ హౌస్ ఇన్సిడెంట్‌పై ఆయన కూడా రియాక్ట్ అయ్యారు. తనదైన శైలిలో ఓటర్లను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు.

ఆ రెండు పార్టీలను నమ్ముకోవద్దని కేఏ పాల్ కోరారు. మోడీ నుంచి దేశాన్ని, కేసీఆర్ నుంచి రాష్ట్రాన్ని కాపాడాలని కోరారు. ఏం జరుగుతుందో జనాలు గుర్తించాలని సూచించారు. కొనుగోలు వ్యవహారంలో మధ్యవర్తులు కిషన్ రెడ్డి, రఘునందన్ రావు అని హాట్ కామెంట్స్ చేశారు. ఒక్కో ఎమ్మెల్యేకు 100 కోట్లు ఇస్తారని తాను ముందే చెప్పానని గుర్తుచేశారు.

ka paul reacts about farmhouse incident

మహారాష్ట్రలో జరిగింది తెలంగాణలో కూడా అమలు చేస్తున్నారని గుర్తుచేశారు. మునుగోడులో బీజేపీ, టీఆర్ఎస్ వేల కోట్లు ఖర్చు పెడుతున్నారని తెలిపారు. ఆ రెండు పార్టీలను చిత్తుగా ఓడించాలన్న పాల్.. ఉంగరం గుర్తుకే ఓటు వేయాలని జనాలను కోరారు. కాంగ్రెస్ పార్టీని కూడా తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. వారిని కూడా తనకే ఓటు వేయాలని కోరారు.

మొయినాబాద్ ఇన్సిడెంట్ కేసీఆర్ ఆడించిన డ్రామా అన్నారు. బీజేపీ కూడా నేతలను పశువుల మాదిరిగా కొంటుందని ఆరోపించారు. ఇప్పటికే దేశంలో ఇలాంటి ఘటనలు చాలా చూశాం అని తెలిపారు. ఇప్పుడు మరొటి వెలుగులోకి వచ్చిందని వివరించారు. అంబేద్కర్, పూలే కాన్షిరాం స్పూర్తిగా తమ పార్టీ పనిచేస్తోందని తెలిపారు. సబ్బండ వర్గాల సంక్షేమమే తమ ప్రాధాన్యం అని తెలిపారు.

English summary
ka paul reacts about farmhouse incident. we must save country with modi and state with kcr
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X