ఏపీ రాజకీయాలపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు: విశాఖ స్టీల్ ప్రైవేటీకరణపై మోడీకి సవాల్
అమరావతి: భారత పురోగమనం కోసమే బీఆర్ఎస్ అని భారత్ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ సమక్షంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సీనియర్ రాజకీయ నేతలు తోట చంద్రశేఖర్, రావెల కిశోర్ బాబు, చింతల పార్థసారథి, టీజే ప్రకాశ్, రమేష్ నాయుడు, గిద్దల శ్రీనివాస్, జేటీ రామారావు తోపాటు భారీ సంఖ్యలో నేతలు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ భవన్‌లో పలువురు కీలక నేతలకు బీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కేసీఆర్.

ఏపీ కూడా భాగస్వామి కావాలంటూ కేసీఆర్
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. దేశంలో ద్వేషం పెంచితే ఎవరు నాశనమవుతారని ప్రశ్నించారు. గోల్ మాల్ గోవిందం గాళ్లను ఇంకా భరించాలా? అని ప్రశ్నించారు. చంద్రశేఖర్, రావెలతో అభిప్రాయాలు పంచుకున్నట్లు తెలిపారు. కష్టపడాల్సి ఉంటుందని వారికి చెప్పానన్నారు. గెలుపోటములు అవమానాలుంటాయన్నారు. తనతో కలిసివస్తామని నేతలు చెప్పారని తెలిపారు. ఏపీ రాజకీయాలపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత పురోగామిలో ఏపీ కూడా భాగస్వామి కావాలన్నారు కేసీఆర్.

ఏపీ రాజకీయాలపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
మేమే చేయగలం అని ఏపీలో కొందరు అనుకుంటున్నారు.. అది మారాలి.
ఏపీలో మేం కర్తలం దర్తలం అనే దోరణి మరాలి. అసలు సిసలైన ప్రజా రాజకీయాలు రావాలి అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర, కర్ణాటక ప్రజలు కూడా తెలంగాణ పథకాలు కోరుకుంటున్నారని చెప్పారు. దేశంలోని అన్ని గ్రామాల్లోకి కూడా బీఆర్ఎస్ కమిటీలు ఏర్పడతాయన్నారు. సంక్రాంతి తర్వాత బీఆర్ఎస్ కార్యక్రమాలు హోరెత్తుతాయన్నారు.

దేశం కోసం దేశమంతా బీఆర్ఎస్ అంటూ కేసీఆర్
తెలంగాణ, ఏపీ కాదు.. దేశంలోని అన్ని అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల్లోనూ బీఆర్ఎస్ పోటీ చేస్తుందన్నారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పశ్చిమం నుంచి తూర్పు వరకు బీఆర్ఎస్ వెళుతుందన్నారు. లక్ష కిలోమీటర్ల ప్రయాణమైనా ఒక అడుగుతోనే ప్రారంభమవుతుందన్నారు.
తన మాటలపై అందరూ చర్చించుకోవాలన్నారు. రాజకీయమంటే గేమ్, గోల్‌మాల్ కాదని.. టాస్క్, లక్ష్యం అని వ్యాఖ్యానించారు. ప్రజల కోసం పనిచేయడమే లక్ష్యంగా ఉండాలన్నారు.

విశాఖ స్టీల్ ప్రైవేటీకరణపై మోడీకి కేసీఆర్ సవాల్
గుణాత్మకమైన రాజకీయాల కోసమే బీఆర్ఎస్. చాలా మందికి పదవులు అవకాశాలు వస్తాయి. ప్రగతి ప్రస్థానం ప్రారంభం కావాలి.
ప్రజలకు అన్ని తెలియజేయాలి. బీఆర్ఎస్‌కు అధికారం ఇస్తే రెండేళ్లలలో వెలుగుజిలుగుల భారతదేశం అవుతుందన్నారు. ఇందుకోసం లక్షా 45వేల కోట్లు అవుతుందన్నారు. తెలంగాణలో ప్రారంభించిన ఉచిత విద్యుత్, దళితబంధు దేశ వ్యాప్తంగా అమలు చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు.
అధికారంలో ఉన్న మోడీ విశాఖ ఉక్కును అమ్ముతాం అని అంటున్నారు. ఆయన అమ్మితే..బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక.. విశాఖ ఉక్కును వాపస్ తీసుకుంటాం అన్నారు కేసీఆర్. ఎల్ఐసీ సహా ఏవీ ప్రైవేటీకరించినా.. తాము దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత నేషనలైజ్ చేస్తామని కేసీఆర్ తేల్చిచెప్పారు. ఇందుకోసమే బీఆర్ఎస్ అని వ్యాఖ్యానించారు.
-
మందుబాబులకు బిగ్ షాక్.. రేపు వైన్ షాప్ లు బంద్.. -
MMTS సర్వీసుల సంఖ్య పెంపు..? సీఎం రేవంత్ గుడ్ న్యూస్..! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..!












Click it and Unblock the Notifications