పారిశ్రామికవేత్త జయరాం హత్య కేసు: రాకేష్ రెడ్డిని దోషిగా తేల్చిన కోర్టు
ప్రముఖ పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో నాంపల్లి కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. నిందితుడు రాకేష్ రెడ్డిని దోషిగా తేల్చింది.
హైదరాబాద్: ప్రముఖ పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో నాంపల్లి కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. నిందితుడు రాకేష్ రెడ్డిని దోషిగా తేల్చింది. మార్చి 9న దోషికి శిక్షను ఖరారు చేయనుంది.
2019, జనవరి 31న జయరాం దారుణ హత్యకు గురయ్యారు. ఈయనకు హత్య చేసిన రాకేష్ రెడ్డి.. తన స్నేహితులతో కలిసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. జయరాం మృతదేహాన్ని విజయవాడలోని నందిగామ రహదారిపై వాహనంలో ఉంచారు.

కాగా, నాలుగేళ్లుగా విచారణ కొనసాగుతున్న ఈ కేసులో 11 మంది నిందితులపై కేసు కొట్టివేసింది కోర్టు. రాకేష్ రెడ్డే కుట్ర చేసి జయరాంను హత్య చేసినట్లు నిర్ధరించి అతడ్ని దోషిగా తేల్చింది. ఏసీపీ మల్లారెడ్డితోపాటు మరో ఇద్దరు సీఐలను నిర్దోషులుగా ప్రకటించింది.
ఈ కేసుకు సంబంధించి 23 పేజీల ఛార్జిషీట్ దాఖలు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు.. అందులో 12 మందిని నిందితులుగా చేర్చారు. మొత్తం 73 మంది సాక్షులను న్యాయస్థానం విచారించింది. హానీట్రాప్‌తో జయరాం హత్యకు కుట్రపన్నిన రాకేష్ రెడ్డిని.. జయరాంను దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు పక్కా ఆధారాలను ఛార్జీషీట్‌లో జతపరిచారు.
-
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం -
పాలకోసం ఏడుస్తుందని పసిదాన్ని చంపేసిన తల్లి.. తిరుపతి జిల్లాలో దారుణం -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
మరో మూడు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
సపోటా పండులో విషం పెట్టి రెండేళ్ళ కూతుర్ని చంపేసిన తండ్రి.. ఆపై -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !!












Click it and Unblock the Notifications