హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Khairatabad Ganesh 2021:ఈసారి 40 అడుగులతో పంచముఖ రుద్ర మహాగణపతి-నమూనా ఆవిష్కరణ

|
Google Oneindia TeluguNews

విశ్వనగరం హైదరాబాద్ కు ప్రత్యేకత తీసుకొచ్చే వరల్డ్ ఫేమస్ 'ఖైరతాబాద్ గణేశ్'కు సంబంధించి కీలక ప్రకటన వెలువడింది. ఖైరతాబాద్‌ భారీ గణేశుడు ఈసారి పంచముఖ రుద్ర మహాగణపతిగా దర్శనమివ్వనున్నారు. ఎవిగ్రహానికి ముందు నందీశ్వరుడు, గరుఖ్మంతుడు ప్రార్థిస్తున్నట్టుగా కూర్చుని ఉంటారు. వారికి వెనుక ఒకవైపు సింహం, మరో వైపు గుర్రం ఉంటాయి. ఇక మహా గణపతి మంటపానికి ఒక వైపు కాళీ మాత రూపంలోని కృష్ణుడిని ఆరాధిస్తున్న రాధ, మరోవైపు నాగదేవత విగ్రహాలు కొలువుదీరనున్నాయి.

జగన్ ఆదేశం, మోదీ శాసనం -బెయిల్ రద్దు తథ్యం -లక్ష్మీపార్వతి జూదం -కేసీఆర్‌ జగడం: రఘురామ సంచలనంజగన్ ఆదేశం, మోదీ శాసనం -బెయిల్ రద్దు తథ్యం -లక్ష్మీపార్వతి జూదం -కేసీఆర్‌ జగడం: రఘురామ సంచలనం

ఖైరతాబాద్ గణేశ్ 2021 ఉత్సవ విగ్రహ నమూనాను భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ కమిటీ కమిటీ సభ్యులు శనివారం ఆవిష్కరించారు. కొవిడ్‌ నేపథ్యంలో ఈ ఏడాది 40 అడుగుల విగ్రహం ఏర్పాటు చేయాలని ఉత్సవ కమిటీ నిర్ణయించింది. పంచముఖ రుద్ర మహాగణపతి రూపాన్ని డిజైన్ చేసిన ఎస్. అన్బరాసన్ అని, విగ్రహం చేయబోయే శిల్పి సి.రాజేంద్రన్ అని ఉత్సవ కమిటీ తెలిపింది. గతేడాది కూడా కొవిడ్‌ నేపథ్యంలో 18 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కాగా,

Khairatabad Ganesh 2021: 40-feet idol to be set up this year, panchamukha rudra maha ganapathi

సెప్టెంబర్‌ 10వ తేదీ నుంచి గణేశ్‌ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు భాగ్యనగర్‌ గణేశ్‌ ఉత్సవ సమితి శనివారం తెలిపింది. ఈ ఏడాది కొవిడ్ జాగ్రత్తలతో ఉత్స‌వాల‌ను నిర్వహించనున్నట్లు ఉత్సవ సమితి జనరల్‌ సెక్రెటరీ భగవంత్‌రావు పేర్కొన్నారు. ఈ నెల 23న భాగ్యనగర్ గణేశ్‌ ఉత్సవ సమితి కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు ఆయ‌న‌ తెలిపారు.

షాకింగ్: స్మశానాన్ని అమ్మేసిన కేసీఆర్ సర్కార్ -వేలాన్ని ఆపాలని హైకోర్టు ఆదేశం -ఖానామెట్ భూమిలో కిరికిరిషాకింగ్: స్మశానాన్ని అమ్మేసిన కేసీఆర్ సర్కార్ -వేలాన్ని ఆపాలని హైకోర్టు ఆదేశం -ఖానామెట్ భూమిలో కిరికిరి

ఖైరతాబాద్ కు సంబంధించి 2021లో జరిగే వేడుకలో 67వ ఉత్సవాలుగా కమిటీ పేర్కొంది. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్‌ 10న ఉత్సవాలు ప్రారంభమై 19వ తేదీ ఆదివారం నిమజ్జన కార్యక్రమంతో ముగియ‌నున్న‌ట్లు పేర్కొన్నారు. ఏకాదశిని పురస్కరించుకున్న జులై 10నే ఖైరతాబాద్ గణేశ్ విగ్రహం తయారీ పనుల్లో తొలి ఘట్టమైన కర్నపూజ జరిగింది. ప్రస్తుతం పనులు కొనసాగుతున్నాయి.

English summary
One of Hyderabad’s most popular Ganesha idols, the Khairatabad Ganesh, will be of 40 feet height this year. The 2021 avatar panchamukha rudra maha ganapathi, will be flanked by idols of Goddesses Lakshmi Devi and Parvathi Devi, says bhagyanagar ganesh utsav committee. Ganapathi navaratri festival will be held from September 10.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X