Khairathabad: ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం పూర్తి..
హైదరాబాద్ లో గణేష్ విగ్రహాల నిమజ్జనం కొనసాగుతోంది. ట్యాంక్ బాండ్ పైకి భారీగా ప్రజలు వచ్చి నిమజ్జనాన్ని తిలకిస్తున్నారు. ప్రఖ్యాతిగాంచిన ఖైరతాబాద్ గణేషుడి విగ్రహ నిమజ్జనం పూర్తి అయింది. 10 రోజుల పాటు పూజలు అందుకున్న గణపయ్య మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట 30 నిమిషాల సమయంలో గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. ఈ దృశ్యాన్ని చూడడానికి వేలాది మంది భక్తులు తరలొచ్చారు. 70 అడుగుల ఎత్తు ఉన్న భారీ విగ్రహాన్ని పెద్ద నాలుగో నంబర్ క్రేన్ తో హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేశారు.
ఖైరతాబాద్ గణేషుడి శోభాయాత్ర ఉదయం 6 గంటలకు ప్రారంభమైన మధ్యాహ్నం 1.30 నిమిషాల వరకు కొనసాగింది. శోభాయాత్ర రెండున్నర కిలోమీటర్లు కొనసాగింది. టెలిఫోన్ భవన్, సెక్రటేరియట్, ఎన్టీఆర్ మార్గ్ మీదుగా సప్తముఖ మహాగణపతి ట్యాంక్‌బండ్ చేరుకున్నాడు. కాగా ఈసారి ఖైరతాబాద్ మహా గణపతి హుండీ ఆదాయం భారీగా పెరిగింది. హుండీ ఆదాయమే రూ.70 లక్షల వచ్చినట్లు ఉత్సవ కమిటీ ప్రకటించింది. గణనాథుడి చుట్టూ, పరిసరాల్లో ఏర్పాటు చేసిన వివిధ కంపెనీల ప్రకటనల ద్వారా మరో రూ.40 లక్షల ఆదాయం వచ్చినట్లు సమాచారం.

ఖైరతాబాద్ గణేషుడికి స్కానర్ల ద్వారా గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం, అమెజాన్ ద్వారా డిజిటల్ చెల్లింపులు చేశారు. వాటిని కూడా లెక్కించాల్సి ఉంది. మొత్తంగా ఈసారి ఖైరతాబాద్ బడా గణనాథుడికి రూ.కోటికి పైగా ఆదాయం వచ్చినట్లే. గణేషుడి నిమజ్జనం సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకున్నారు. అనుకున్న టైమ్ లోనే ఖైరతాబాద్ విఘ్నేశ్వరుడిని గంగమ్మ ఒడికి చేర్చారు.
ఖైరతాబాద్ సప్తముఖ మహాగణపతి నిమజ్జనం సంపూర్ణమైంది.
— greatandhra (@greatandhranews) September 17, 2024
70 అడుగుల లంబోదరుడిని ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు చేసిన భారీ క్రేన్ తో హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేశారు. pic.twitter.com/C6t8ZhwLM0
బాలాపూర్ గణేషుడి శోభాయాత్ర కొనసాగుతోంది. ఈ యాత్ర 19 కిలోమీటర్లు కొనసాగనుంది. బాలాపూర్ గణనాథుడు గుర్రం చెరువు కట్టమైసమ్మ వద్ద నుంచి హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి ప్రవేశిస్తుంది. బాలాపూర్ నుంచి కేశవగిరి, చాంద్రాయణగుట్ట, ఎంబీఎన్‌ఆర్ ఎక్స్‌రోడ్డు, ఫలక్‌నుమా రైల్వే బ్రిడ్జి, అలియాబాద్, నాగుల్‌చింత, చార్మినార్ అఫ్జల్ బగూర్జాల్, ఎంజే మార్కెట్, బషీర్‌బాగ్, లిబర్టీ, ఎన్టీఆర్ మార్గ్, అంబేడ్కర్ విగ్రహం, నెక్లెస్ రోడ్డు సాగుతోంది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications