ఒకే కారులో బావాబామ్మర్దులు: డ్రైవింగ్ చేస్తూ కేటీఆర్, పక్కనే హరీశ్ రావు, ఎటు వెళ్తున్నారంటే?
హైదరాబాద్: మాజీ మంత్రులైన బావబామ్మర్దులు కేటీఆర్, హరీశ్ రావు ఒకే కారులో ప్రయాణించి సందడి చేశారు. శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌కు వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఎట్ హోం కార్యక్రమం శుక్రవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు కొనసాగనుంది.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బొల్లారంలోని శీతాకాల విడిది భవన ప్రాంగణంలో జరిగే ఈ కార్యక్రమానికి అధికార పార్టీతోపాటు.. విపక్ష పార్టీ ప్రజాప్రతినిధులకు ఆహ్వానం అందింది. దీంతో బీఆర్ఎస్ నేతలు, బావాబామ్మర్దులైన హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరూ బొల్లారం బయలు దేరారు. తెలంగాణ భవన్ నుంచి ఇద్దరూ ఒకే కారులో ప్రయాణించారు. కేటీఆర్ స్వయంగా డ్రైవింగ్ చేస్తుండగా.. హరీష్ రావు ఆయన పక్కన కూర్చొని కనిపించారు.

ఈ ఫొటోలను హరీశ్ రావు తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారాయి. కాగా, ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సర్జరీ తర్వాత.. బీఆర్ఎస్ పార్టీని నడిపించే తాత్కాలిక బాధ్యతను కేటీఆర్, హరీష్ రావు తీసుకున్నారు. ఇద్దరూ వరుసగా సమావేశాల్లో పాల్గొంటూ.. పార్టీ కేడర్ కు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరూ ఒకే కారులో ప్రయాణించడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, ఇద్దరు కీలక నేతలను ఒకే ఫ్రేమ్‌లో చూడటం ఎంతో సంతోషంగా ఉందని బీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు కామెంట్స్ చేస్తున్నారు.
Enroute to Rashtrapati Nilayam, Bolarum along with Sri @KTRBRS to attend the 'At Home' reception hosted by Hon‘ble President of India. pic.twitter.com/aN5O39L6dS
— Harish Rao Thanneeru (@BRSHarish) December 22, 2023
ఇది ఇలావుండగా, బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోం కార్యక్రమం దృష్ట్యా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ లోతుకుంట, టి జంక్షన్, ఎంసీఈఎంఈ సిగ్నల్, లాల్ బజార్, టి.జంక్షన్, తిరుమలగిరి ఎక్స్‌రోడ్స్, సికింద్రాబాద్ క్లబ్‌ఇన్ గేట్, టీవోలీ కూడలి, ప్లాజా ఎక్స్ రోడ్, సీటీఓ, ఎస్‌బీఐ జంక్షన్, రసూల్‌పుర, పీఎన్‌టీ పైవంతెన, గ్రీన్‌ల్యాండ్, మొనప్ప కూడలి, ఖైరతాబాద్ వీవీ విగ్రహం జంక్షన్ వద్ద, పంజాగుట్ట, ఎన్ఎఫ్‌సీఎల్ ఎన్టీఆర్ భవన్, జూబ్లీహిల్స్ చెక్ పోస్టుల వద్ద ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.












Click it and Unblock the Notifications