కేటీఆర్ అమెరికా టూర్: హైదరాబాద్‌లో వీఎక్స్‌ఐ గ్లోబల్ సొల్యూషన్ సెంటర్, 10 వేలకుపైగా జాబ్స్

హైదరాబాద్‌: అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చేస్తున్న ప్రయత్నాలతో.. రాష్ట్రానికి పెట్టుబడులు ప్రవాహం కొనసాగుతోంది. ఇప్పటికే పలు ప్రముఖ సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు కుదుర్చుకోగా.. ఇప్పుడు మరో దిగ్గజ సంస్థ ముందుకు వచ్చింది. హైదరాబాద్‌లో 10 వేల మందితో ఉపాధి కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు వీఎక్స్ఐ సొల్యూషన్స్(VXI Global Solutions) ప్రకటించింది.

ఈ మేరకు మంత్రి కేటీఆర్‌తో VXI Global Solutions గ్లోబల్ చీఫ్ హెచ్ఆర్ ఎరికా బోగర్ కింగ్ సమావేశమై.. సంస్థ నిర్ణయాన్ని వెల్లడించారు. 1998లో నెలకొల్పిన ఈ సంస్థకు ప్రస్తుతం ఉత్తర అమెరికా, ఆసియా, ఐరోపా, కరేబియన్ దేశాల్లోని 42 కేంద్రాల్లో 40 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. తాజాగా, హైదరాబాద్ నగరంలో 10 వేల మందితో కొత్త కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. నగరానికి మరో ఐటీ సంస్థ రావడంతో మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తంచేశారు.

KTR US visit: VXI global solutions to setup a center in hyderabad, with 10000 employees.

మరోవైపు, హైదరాబాద్‌లో టెక్నాలజీ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఏర్పాటుకు.. ప్రముఖ పర్యాటక సంస్థ మాండీ ముందుకొచ్చింది. ఆ కేంద్రంతో 2వేల మందికి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని కేటీఆర్‌తో సమావేశం తర్వాత.. మాండీ ఛైర్మన్‌ ప్రసాద్‌ గుండుమోగుల తెలిపారు. ప్రముఖ గేర్ల ఉత్పత్తి సంస్థ.."రేవ్‌ గేర్స్‌" రాష్ట్రంలో ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు అమెరికా పర్యటనలో ఉన్న కేటీఆర్‌​ను కలిసిన రెవ్‌గేర్స్‌ ప్రతినిధి బృందం తమ ఆసక్తిని వ్యక్తం చేసింది.

ఇది ఇలావుండగా, డిజిటల్‌ సొల్యూషన్స్‌ రంగంలో అగ్రగామి సంస్థ రైట్‌ సాఫ్ట్‌వేర్‌ తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ విద్యాసంస్థలకు సహకరిస్తూ కొత్త అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. జూన్‌ 30న హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్న కేంద్రాన్ని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభిస్తారని సంస్థ ప్రకటించింది. ఈ కేంద్రంలో ప్రత్యక్షంగా 500 మందికి ఉపాధి లభిస్తుందని తెలిపింది. ప్రముఖ గ్లోబల్‌ సప్లై చెయిన్‌, డిజిటల్‌ సొల్యూషన్స్‌ సంస్థ చెక్‌జెన్స్‌ హైదరాబాద్‌లో అడ్వాన్స్‌ టెక్నాలజీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్‌ను కలిశారు చెక్‌జెన్స్‌ అధ్యక్షుడు లక్ష్మీ ఎనిగెల్ల, సీఈవో రఘు కొమ్మరాజు. అనంతరం ఈ మేరకు ప్రకటించారు.

కాగా, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, ఐరోపాలో సెల్ఫ్‌ స్టోరేజి పరిశ్రమలో.. సేవలు అందిస్తున్న స్టోరెబుల్‌ సంస్థ.. ఇప్పుడు హైదరాబాద్‌లో 100 మంది సాఫ్ట్‌వేర్‌ డెవలపర్లను నియమించుకొని విస్తరణ ప్రణాళికపై దృష్టిసారించనున్నట్లు వెల్లడించింది. ఆ విస్తరణతో.. పరిశోధన, అభివృద్ధి రంగం మరింత అభివృద్ధి చెందుతుందని, మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించగలమని సంస్థ తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర అకాడమీ ఫర్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జి- టాస్క్​తో కలిసి పనిచేయనున్నట్లు పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+