సిటీకి తలమానికమైన స్టీల్ బ్రిడ్జి పనులు 3 నెలల్లో పూర్తి కావాలి: కేటీఆర్ ఆదేశాలు
సెంట్రల్ హైదరాబాద్ నగరానికి స్టీల్ బ్రిడ్జి తలమానికంగా మారతోందున్నారు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్.
హైదరాబాద్: సెంట్రల్ హైదరాబాద్ నగరానికి స్టీల్ బ్రిడ్జి తలమానికంగా మారతోందున్నారు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్. ముషీరాబాద్ నియోజకవర్గంలో శనివారం ఆయన పర్యటించారు. పర్యటనలో భాగంగా స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులతోపాటు ఎస్ఎన్డీపీ పనులను కేటీఆర్ పరిశీలించారు. లోయర్ ట్యాంక్ బండ్ నుంచి వీఎస్టీ వరకు నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జి పనులను పరిశీలించి, పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. నగరానికి తలమానికంగా నిలవనున్న స్టీల్ బ్రిడ్జి పనులను మూడు నెలల్లోగా పూర్తి చేయాలని అధికారులను కేటీఆర్ ఆదేశించారు. అవసరమైతే అదనపు బృందాలు ఏర్పాటు చేసి పనులను వేగవంతం చేయాలని సూచించారు.

2.8 కిలోమీటర్ల పొడవైన నాలుగు వరుసల స్టీల్ బ్రిడ్జి కోసం జీహెచ్ఎంసీ రూ. 440 కోట్లు ఖర్చు చేస్తోందని మంత్రి తెలిపారు. స్టీల్ బ్రిడ్జి నిర్మాణం తర్వాత ట్రాఫిక్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుందన్నారు.

ఆ తర్వాత హుస్సేన్ సాగర్ సర్‌ప్లస్ నాలాలో చేపడుతున్న పనులను కూడా కేటీఆర్ పరిశీలించారు. అశోక్ నగర్ వద్ద కొనసాగుతున్న రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులను కేటీఆర్ పరిశీలించారు. హుస్సేన్ సాగర్ సర్‌ప్లస్ నాలాకు భారీగా నిధులు కేటాయించామని, వర్షాకాలం నాటికి పనులన్నీ పూర్తి చేయాలని అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు.













Click it and Unblock the Notifications