వాళ్ళను చూస్తే భయంగా ఉంది చెల్లి ... వెటర్నరీ డాక్టర్ ప్రియాంకా రెడ్డి చివరి సంభాషణ ఇదే
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్, చటాన్ పల్లి శివారులో వెటర్నరీ డాక్టర్ ప్రియాంకా రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. చటాన్ పల్లి వద్ద యువతి మృతదేహం తగలబడుతుండటంతో అది గుర్తించిన స్థానికులు, పోలీసులకు సమాచారం అందించారు. ఈ హత్య కేసును దర్యాప్తు చేస్తున్న షాద్ నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేపట్టారు.ఇక మృతి చెందిన డాక్టర్ ప్రియాంకా రెడ్డి సోదరితో మాట్లాడిన చివరి ఫోన్ సంభాషణ ఆధారంగా కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు .

స్కూటీ టైర్ పంచర్ ... సోదరికి ఫోన్ చేసి తన పరిస్థితి చెప్పిన ప్రియాంకా రెడ్డి
వృత్తిరీత్యా వెటర్నరీ డాక్టర్ అయిన ప్రియాంక రెడ్డి నిన్న మాదాపూర్ లోని హాస్పిటల్ కి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ఆమె స్కూటీ టైర్ పంచర్ అయింది. దీంతో 9:30 ప్రాంతంలో తన స్కూటీ పాడైందని సోదరికి ఫోన్ చేసింది ప్రియాంక రెడ్డి. సోదరికి ఫోన్ చేసిన ప్రియాంక రెడ్డి తనకు చాలా భయంగా ఉందని తెలిపింది. రోడ్డుపై తన బండి వెనక టైరు పంచర్ అయిందని , అక్కడ లారీలో ఉన్న వారు టైర్ పంచర్ చేయించుకొని వస్తామని బండి తీసుకువెళ్లారని సోదరికి చెప్పింది.

లారీ వాళ్ళు ఎవరో సహాయం చేస్తామని బండి తీసుకెళ్ళారని చెప్పిన ప్రియాంకా
అయితే ఎక్కడ టైర్ పంచర్ షాప్ లు తెరచిలేకపోవడంతో తిరిగి బండి వెనక్కి తీసుకు వచ్చారని చెప్పిన ప్రియాంక రెడ్డి, మళ్లీ ప్రయత్నం చేస్తామని బండిని లారీలో ఉన్నవాళ్ళుతీసుకు వెళ్లినట్లుగా చెప్పింది. తనకు చాలా భయంగా ఉందని, రోడ్డుపై ఒక్కదాన్నేఉన్నానని తన ఇబ్బందిని సోదరికి చెప్తూ, తనతో మాట్లాడుతూనే ఉండమని కోరింది. అయితే ప్రియాంక రెడ్డి సోదరి దగ్గరలో ఉన్న టోల్ ప్లాజా దగ్గరకు వెళ్లి నిలబడమని, అక్కడైతే జనాలు ఉంటారని, ఎలాంటి భయము ఉండదు అని సోదరికి సూచించింది.

దగ్గరలోని తొల ప్లాజా వద్దకు వెళ్లి నిలబడమని సూచించిన చెల్లి
ప్రియాంక రెడ్డి అక్కడ అందరూ చూస్తారు అని తన ఇబ్బందిని వ్యక్తం చేసింది. సోదరి పదేపదే టోల్ గేటు దగ్గరికి వెళ్ళాలని సూచించిన, అక్కడకు వెళ్ళడానికి తీవ్ర ఇబ్బందిని వ్యక్తం చేస్తూ, లారీలో ఉన్న వాళ్ళను చూస్తే భయంగా ఉందని, వారు తన ఎదురుగానే ఉన్నారని చెప్పింది ప్రియాంక రెడ్డి. స్కూటీ పంచర్ చేయించుకొని వస్తామని వెళ్లి షాపులు తెరిచి లేవని తిరిగి వచ్చిన క్రమంలో అలాగే వెళ్తానని ప్రయత్నం చేసిన ప్రియాంక రెడ్డిని లారీలో ఉన్న వ్యక్తులు అడ్డుకున్నారని చెప్పింది. మేడం వెళ్ళకండి అని వద్దని వారించారని, అలా వెళితే మధ్యలో ఇబ్బంది పడతారని , బండి కచ్చితంగా రిపేరు చేయించి ఇస్తామని వాళ్ళు చెప్పారని ప్రియాంక రెడ్డి సోదరికి చెప్పింది.

వాళ్ళను చూస్తుంటే భయంగా ఉందని సోదరిని మాట్లాడుతూనే ఉండు అని కోరిన ప్రియాంకా రెడ్డి
పదేపదే వాళ్ళను చూస్తుంటే చాలా భయంగా ఉంది అని సోదరి కి చెప్పిన ప్రియాంక రెడ్డి చాలాసేపు సోదరితో మాట్లాడుతూనే ఉండమని ప్రాధేయపడింది. ఆ తర్వాత ఆమె ఫోన్ సిగ్నల్ పోవడం, స్విచ్ పోవడం జరిగిపోయాయని సోదరి రోదిస్తూ చెప్పింది. పదేపదే టోల్ ప్లాజా దగ్గరికి వెళ్లి నిలబడమని చెప్పినా, తన మాట వినలేదని తీవ్రంగా దుఃఖించింది. దాదాపు అరగంట పాటు సోదరి ప్రియాంక రెడ్డితో మాట్లాడుతూనే ఉన్నట్లుగా ఆమె చెప్పింది. ప్రియాంక రెడ్డి మాట్లాడిన అంశాలను బట్టి, ప్రియాంక రెడ్డి చెల్లెలు చెప్పిన విషయాలను బట్టి ఆ తర్వాత ఏం జరిగింది అన్నదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ప్రియాంక చెల్లి చెప్పిన వివరాలను బట్టి దర్యాప్తు ముమ్మరం... 15 బృందాలతో గాలింపు
ఇక ప్రియాంకా రెడ్డి హత్య కేసును ఛేదించడానికి పోలీసులు ప్రత్యేక టీమ్లను ఏర్పాటు చేసి గాలింపు ముమ్మరం చేశారు. 15 బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు షాద్ నగర్ పోలీసులు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన శంషాబాద్ డిసిపి ప్రకాష్ రెడ్డి, షాద్ నగర్ ఏసిపి సురేందర్ ఈమధ్య మిస్టరీని ఛేదించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. మృతి చెందిన యువతి తండ్రి తో పాటు కుటుంబ సభ్యులు కూడా ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఈ ఘాతుకానికి పాల్పడిన దుండగులను త్వరితగతిన పట్టుకుంటామని పోలీసులు చెప్తున్నారు.
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..!












Click it and Unblock the Notifications