జీరో రిసీట్... నో క్యాష్ ట్రాన్సక్షన్స్... మిన్నంటిన ఎల్‌ఐసి ఏజెంట్ల ఆందోళన...!

హైదరాబాద్ : దేశవ్యాప్తంగా ఎల్‌ఐసి ఏజెంట్లు చేపట్టిన ఆందోళన కార్యక్రమాలు ఉధృతమవుతున్నాయి. ఎల్‌ఐసి ఏజెంట్ యూనియన్ సంఘాల ఆల్ ఇండియా జేఏసీ పిలుపు మేరకు దేశమంతటా నిరసన పెల్లుబికింది. అందులో భాగంగా 5వ తేదీ సోమవారం నాడు తలపెట్టిన స్ట్రైక్ విజయవంతమైంది. ఆ క్రమంలో హైదరాబాద్ డివిజన్‌లోని ఇరవైకి పైగా ఎల్‌ఐసి బ్రాంచుల్లో జీరో రిసీట్ బిజినెస్ జరిగినట్లు సమాచారం. అంటే ఎల్‌ఐసి కౌంటర్లలో ప్రీమియం కట్టడం గానీ, రెన్యూవల్స్ కోసం క్యాష్ కట్టడం, పాలసీ పునరుద్ధరణ లాంటి సేవలకు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. ఆయా బ్రాంచుల్లో శాంతియుత ధర్నా కార్యక్రమాలు చేపట్టిన ఎల్‌ఐసి ఏజెంట్లు... వివిధ సేవల కోసం వచ్చిన కస్టమర్లకు తమ ఆందోళన కార్యక్రమం గురించి తెలపడంతో ఎక్కడికక్కడ వెనుదిరిగిపోయారు.

 మిన్నంటిన నినాదాలు... కదం తొక్కిన ఎల్‌ఐసి ఏజెంట్లు...!

మిన్నంటిన నినాదాలు... కదం తొక్కిన ఎల్‌ఐసి ఏజెంట్లు...!

దేశవ్యాప్తంగా ఎల్‌ఐసి ఏజెంట్లు కదనరంగంలోకి దిగారు. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నిరసన బాట పట్టారు. ఇన్సూరెన్స్ రంగంలో దిగ్గజమైన ఎల్‌ఐసికి పునాదులైన ఏజెంట్లు... పసలేని విధానాలతో ప్రస్తుతం రోడ్డెక్కాల్సిన దుస్థితి దాపురించిందని యూనియన్ నేతలు వాపోయారు. ఏజెంట్ యూనియన్ల ఆల్ ఇండియా జేఏసీ పిలుపు మేరకు దేశమంతటా నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఒకే దేశం, ఒకే సమాఖ్య, ఒక్క ఆందోళన నినాదంతో ఆల్ ఇండియా జేఏసీ ఆందోళన కార్యక్రమాలకు నాంది పలికింది. అందులో భాగంగా 5వ తేదీ సోమవారం నాడు హైదరాబాద్ డివిజన్ పరిధిలోని ఇరవైకి పైగా బ్రాంచుల్లో ఏజెంట్లు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. డిమాండ్ల సాధన కోసం ఏజెంట్లు చేసిన నినాదాలు మిన్నంటాయి. పాలసీల రెన్యూవల్స్, ల్యాప్స్ ఐన పాలసీల పునరుద్ధరణ లాంటి సేవల నిమిత్తం ఆయా బ్రాంచులకు వచ్చిన కస్టమర్లకు తమ గోడు వినిపించడంతో వారు వెనుదిరిగిపోయారు. దీంతో ఎల్‌ఐసి కౌంటర్లు బోసిపోయి కనిపించాయి. ఏజెంట్లు చెప్పింది సావధానంగా విన్న కస్టమర్లు వెనుదిరిగి పోవడమే గాకుండా... మా సపోర్టు మీకే అంటూ మద్దతు పలికినట్లు యూనియన్ నేతలు తెలిపారు. మొత్తానికి ఏజెంట్ల ఆందోళన కారణంగా... 5వ తేదీ సోమవారం నాడు హైదరాబాద్ డివిజన్‌లోని ఇరవైకి పైగా బ్రాంచుల్లో జీరో రిసీట్ ట్రాన్సక్షన్ జరిగినట్లు తెలుస్తోంది.

 పాలసీదారులను గుర్తించండి... మెరుగైన సేవలందించండి

పాలసీదారులను గుర్తించండి... మెరుగైన సేవలందించండి

దేశవ్యాప్తంగా ఎల్‌ఐసి ఏజెంట్లు తలపెట్టిన ఆందోళన కార్యక్రమాల్లో పాలసీదారులకు పెద్దపీట వేశారు. పాలసీలపై బోనస్ పెంచడం... పాలసీ లోన్ వడ్డీ రేట్లు తగ్గించడం... సమర్థవంతమైన సేవలందించడం... బ్రాంచుల్లో పౌరుల చార్టర్ ప్రదర్శించడం... ఐదేళ్లకు పైబడి ల్యాప్స్ అయిన పాలసీలను పునరుద్దరించడం లాంటి డిమాండ్లతో నిరసన బాట పట్టారు. పాలసీలపై బోనస్ పెంచడం ద్వారా కస్టమర్లకు మరింత ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది. అలాగే పాలసీ మూడేళ్లు పూర్తయిన తర్వాత ఇచ్చే లోన్లపై ప్రస్తుతమున్న వడ్డీ రేట్లు తగ్గించడం ద్వారా పాలసీదారులకు మేలు జరగనుంది. వడ్డీ భారం తగ్గే నేపథ్యంలో కస్టమర్లకు ఊరట లభించనుంది. అలాగే పాలసీదారులకు సమర్థవంతమైన, వేగవంతమైన సర్వీస్ ఇవ్వడం ద్వారా వారికి సమయం కలిసిరానుంది. ఇలా అనేక రకాలుగా పాలసీదారులకు మేలు కలిగించే విధంగా ఏజెంట్లు తలపెట్టిన ఆందోళన కార్యక్రమాలకు వారు కూడా మద్దతు పలుకుతుండటం విశేషం.

గొంతెమ్మ కోర్కెలు కాదు... డిమాండ్ల సాధన మా హక్కు...!

గొంతెమ్మ కోర్కెలు కాదు... డిమాండ్ల సాధన మా హక్కు...!

ఎల్‌ఐసి ప్రస్థానం మొదలు ఇప్పటివరకు ఏజెంట్లదే కీరోల్ అంటున్నారు యూనియన్ నేతలు. ఏజెంట్లే ఎల్‌ఐసికి పునాదులని ఘంటాపథంగా చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో కష్టనష్టాలకు ఓర్చి కస్టమర్ల నుంచి పాలసీ తీసుకురావడం ఆషామాషీ కాదంటున్నారు. తమ చెమట చుక్కల పునాదుల మీద భవంతిగా ఎదిగిన ఎల్‌ఐసిలో తమను గుర్తించకపోవడం బాధాకరమని ఏజెంట్లు వాపోతున్నారు. ఏజెంట్ల సంక్షేమ నిధి ఏర్పాటు చేయడం, ఏజెంట్ల పిల్లలకు విద్యారుణాలు ఇవ్వడం, గ్రాట్యూటీ లెక్కింపు విధానం మార్చడం, గ్రాట్యూటీ పెంచడం, గ్రూప్ మరియు టర్మ్ ఇన్సూరెన్స్ పెంచడం, ఐఆర్‌డీఎ ప్రకారం కమిషన్ స్ట్రక్చర్ పునర్నిర్మాణం చేయడం లాంటి న్యాయసమ్మతమైన డిమాండ్లను యాజమాన్యం వెంటనే గుర్తించాలని కోరుతున్నారు.

పెద్దల ద‌ృష్టికి డిమాండ్లు... శాంతియుత ధర్నా

పెద్దల ద‌ృష్టికి డిమాండ్లు... శాంతియుత ధర్నా

ఎల్‌ఐసి పెద్దల దృష్టికి తమ డిమాండ్లను తీసుకెళ్లే క్రమంలో 6వ తేదీ మంగళవారం ఛలో డివిజనల్ ఆఫీస్‌కు పిలుపునిచ్చారు ఏజెంట్ యూనియన్ నేతలు. 5వ తేదీ సోమవారం నాడు పలు బ్రాంచుల్లో నిరసన కార్యక్రమం విజయవంతం కావడంతో... హైదరాబాద్ డివిజనల్ కార్యాలయం దగ్గర 6వ తేదీ మంగళవారం తలపెట్టిన శాంతియుత ధర్నా కార్యక్రమానికి పెద్దసంఖ్యలో ఏజెంట్ మిత్రులు తరలిరావాలని కోరారు. హక్కుల సాధన కోసం చేపట్టిన ధర్నా కార్యక్రమంలో ప్రతి ఒక్క ఏజెంట్ పాల్గొని మన ఐక్యతను చాటుదామని పిలుపునిచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+