ఓట్ల పండుగకు ఆర్టీసీ కసరత్తు.. 1300 స్పెషల్ బస్సులు

హైదరాబాద్ : ఎన్నికల కోసం టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపిస్తోంది. ఓటర్లు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాలతో పాటు ఏపీకి కూడా స్పెషల్ బస్సులు సిద్ధం చేశారు అధికారులు. 1300 ప్రత్యేక బస్సులను ఆపరేట్ చేస్తున్న ఆర్టీసీ.. మంగళవారం (09.04.2019) నుంచి 300 బస్సులను ఎంజీబీఎస్, జేబీఎస్ తో పాటు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి నడిపిస్తున్నారు.

lok sabha elections tsrtc runs 1300 special buses

బుధవారం (10.04.2019) నుంచి మరో 900 స్పెషల్ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. ఎన్నికలు జరిగే గురువారం 11వ తేదీ ఉదయం నుంచి మరో 100 బస్సులు నడిపిస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఏపీకి చెందిన చాలామంది హైదరాబాద్ లో నివసిస్తుండటంతో అటువైపు కూడా స్పెషల్ బస్సులు వేశారు. అక్కడ లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎలక్షన్లు కూడా జరుగుతున్న నేపథ్యంలో.. హైదరాబాద్ లో నివసించేవారు ఓటు హక్కు వినియోగించుకోవడానికి స్వస్థలాలకు బయలుదేరుతున్నారు. ఆ క్రమంలో ఎంజీబీఎస్‌ నుంచే కాకుండా కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి, వనస్థలిపురం, అమీర్‌పేట్ తదితర ఏరియాల నుంచి కూడా స్పెషల్ బస్సులు అందుబాటులో ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+