ఇవాళ బాధాకరమైన రోజు, కృష్ణంరాజు ఫ్యామిలీకి సానుభూతి తెలిపిన మహేశ్ బాబు
కృష్ణంరాజు భౌతికకాయానికి పలువరు అంజలి ఘటిస్తున్నారు. స్టార్ హీరో మహేశ్ బాబు సంతాపాన్ని తెలియజేశారు. ఆయన మరణ వార్త తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని అన్నారు. యావత్ తెలుగు సినీ పరిశ్రమకు ఇవాళ చాలా బాధాకరమైన రోజని చెప్పారు. కృష్ణంరాజు జీవితం, సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండి పోతాయని అన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు.
కృష్ణంరాజు అంత్యక్రియలు రేపు మధ్యాహ్నం ఒంటిగంటకు మొయినాబాద్ వద్ద కనకమామిడి ఫాంహౌస్‌లో ప్రభుత్వ లాంఛనాలతో రేపు నిర్వహిస్తారు. ప్రస్తుతం కృష్ణంరాజు భౌతికకాయం ప్రజల సందర్శనార్థం ఆయన నివాసం వద్ద ఉంచారు. రేపు మధ్యాహ్నం వరకు అక్కడే ఉంచనున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియల నేపథ్యంలో, సీఎస్ సోమేశ్ కుమార్ ఆ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

కృష్ణంరాజు మృతిపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, టీడీపీ నేత నారా లోకేష్, సీపీఐ నేత నారాయణ సహా ప్రముఖులు సంతాపం ప్రకటించారు.
ఇటు కృష్ణంరాజు మృతిపై చిరంజీవి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కృష్ణంరాజు ఇక లేరు అనే మాట ఎంతో విషాదకరం అని అన్నారు. మా ఊరి హీరో అని పేర్కొన్నారు. చిత్ర పరిశ్రమలో తన తొలి రోజుల నుంచి పెద్దన్నలా ఆప్యాయంగా ప్రోత్సహించిన కృష్ణంరాజుతో చేసిన సినిమాలను గుర్తుచేశారు.'రెబల్ స్టార్'కి ఆయన నిజమైన నిర్వచనం అని చిరంజీవి అన్నారు. ప్రభాస్, కృష్ణం రాజు కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు.












Click it and Unblock the Notifications