మహిళా ఎమ్మార్వో ఘటన మరువకముందే.. ఏసీబీ వలలో మరో అవినీతి చేప..!
హైదరాబాద్ : తెలంగాణలో అవినీతి చేపలు, తిమింగలాలు వరుసగా పట్టుబడుతున్నాయి. మహిళా ఎమ్మార్వో అవినీతి పర్వం నోట్ల కట్టలను బయటపెట్టింది. ఆమె నివాసంలో లక్షలకొద్దీ కరెన్సీ కట్టలు వెలుగుచూడటం రాష్ట్రవ్యాప్తంగా చర్చానీయాంశమైంది. తాజాగా మరో అవినీతి చేప ఏసీబీకి పట్టుబడటం హాట్ టాపిక్ అయింది.
ఏసీబీ అధికారుల వలకు మరో అవినీతి చేప చిక్కింది. మల్కాజ్‌గిరి పెన్షన్ ఆఫీస్‌లో గుట్టురట్టైంది. అసిస్టెంట్ పెన్షన్ పేమెంట్ అధికారిగా పనిచేస్తున్న పూల్ నాయక్ బండారం బయటపడింది. పెన్షన్ ఇచ్చేందుకు ఓ మహిళ నుంచి 7 వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు.

పెన్షన్ డబ్బులు ఇవ్వడానికి సదరు మహిళను సతాయించాడు పూల్ నాయక్. ఆమెకు పెన్షన్ ఇవ్వడానికి లంచం డిమాండ్ చేశాడు. తనకు కొంత మొత్తం ఇస్తే గానీ పెన్షన్ ఇవ్వబోనంటూ ఇబ్బంది పెట్టాడు. దాంతో బాధితురాలు చేసేదేమీ లేక ఏసీబీని ఆశ్రయించారు. ఏడు వేల రూపాయలు ఆమె నుంచి స్వీకరిస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications