tpcc race: బీజేపీలో చేరతా అని కోమటిరెడ్డి సంచలనం.. తప్పుపట్టిన మల్లురవి...

తెలంగాణ కాంగ్రెస్‌లో టీ పీసీసీ కుంపటి రేపింది. పీసీసీ పోస్ట్ రేవంత్ రెడ్డికే ఇస్తారనే ప్రచారం ఊపందుకొంది. దీంతో వ్యతిరేక వర్గం తమ చివరి అస్త్రాన్ని ప్రయోగించింది. పార్టీ వీడుతామని బెదిరింపులకు దిగుతోంది. ఇప్పటికే వీ హనుమంతరావు బాహాటంగానే కామెంట్లు చేయగా.. పార్టీ వీడతానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సోదరుడు, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కామెంట్ చేశారు. దీంతో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీలో కలకలం నెలకొంది. రాజగోపాల్ రెడ్డి ప్రకటనను కొందరు కాంగ్రెస్ నేతలు కొట్టిపారేస్తున్నారు.

Recommended Video

    TPCC New Chief : VH On Revanth Reddy వీహెచ్ సంచలన వ్యాఖ్యలు.. టీడీపీలో ఉండి ఆ పార్టీనే ఖతం!!
    బీజేపీలో చేరతా..

    బీజేపీలో చేరతా..

    బీజేపీలో చేరతానని ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి ప్రకటన చేశారు. దీనిపై కాంగ్రెస్ నేత మల్లు రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజగోపాల్‌ రెడ్డి బీజేపీలో చేరతానని చేసిన ప్రకటనను తప్పుబట్టారు. రాజగోపాల్‌రెడ్డి ఇచ్చిన షాక్‌తో అప్రమత్తమైన కాంగ్రెస్ సీనియర్‌ నేతలు ఆయనను బుజ్జగించే పనిలో పడ్డారు. ఎంపీ రేవంత్‌ రెడ్డితో సహా పలువురు కీలక నేతలు రాజగోపాల్‌ రెడ్డిను కలిసి నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

    వెంకన్న సాక్షిగా..

    వెంకన్న సాక్షిగా..


    కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన మనసులో మాటను బయటపెట్టేశారు. కొత్తన సంవత్సరం సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత మీడియాతో మాట్లాడారు. బీజేపీలో చేరికపై తన నిర్ణయాన్ని వెంకన్న సాక్షిగా వెల్లడించారు. కొద్ది రోజుల్లో బీజేపీలో చేరుతానని రాజగోపాల్‌రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే.

    కన్ఫామ్ కానీ..

    కన్ఫామ్ కానీ..

    రేవంత్ రెడ్డికి పీసీసీ ఖాయమే కానీ క్షేత్రస్థాయిలో నేతల అభిప్రాయాలు తీసుకోవడంతోపాటు ఇతరుల అభిప్రాయాలు కూడా తీసుకుంటున్నారని సమాచారం. రేవంత్ రెడ్డికి టీ పీసీసీ చీఫ్ ఇవ్వడంతో అటు టీఆర్ఎస్, ఇటు బీజేపీని బలంగా ఎదుర్కొగలదని కొందరు చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో రేవంత్ రెడ్డికి దాదాపుగా టీపీసీసీ చీఫ్ పదవీ ఖాయం అని అనుకున్నారు. అయితే సామాజిక సమీకరణాలు, ఓ వర్గం వ్యతిరేకతతో ఆలస్యమవుతోంది. ఈ క్రమంలో రాజగోపాల్ రెడ్డి పార్టీ వీడతానని కామెంట్ చేయడం కలకలం రేపింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+