Hyderabad: భార్య బాగోతం బయటపెట్టిన భర్త.. వీడియో వైరల్..!
కొద్ది సంవత్సరాల క్రితం భూ వివాదం కేసులో షేక్‌పేట ఆర్‌ఐ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఈ వ్యవహారంలో తహశీల్దార్‌కు ప్రమేయం ఉండొచ్చన్న అనుమానంతో ఆమె ఇంట్లోనూ ఏసీబీ సోదాలు చేయగా.. రూ. 30 లక్షల నగదు, 10 తులాల బంగారు ఆభరణాలు లభించాయి. దీంతో తహశీల్దార్ సుజాతను అరెస్ట్ చేశారు. ఈ అవమానాన్ని భరించలేని ఆమె భర్త అజయ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన ఉస్మానియా వర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు. భార్య సుజాత తహశీల్దార్ గా పని చేశారు.
భార్య అవినీతితో భర్త ప్రాణాలు కోల్పోయాడు. తాజాగా ఓ భర్త భార్య అవినీతిని బయట పెట్టాడు. భార్య అవినీతికి సంబంధించి ఓ వీడియో విడుదల చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హైదరాబాద్ లోని మణికొండ మున్సిపాలిటీలో దివ్య డీఈఈగా పని చేస్తున్నారు. అయితే ఆమె భారీగా లంచాలు తీసుకుని అవినీతికి పాల్పడిందని భర్త శ్రీపాద్ ఆరోపించారు. భార్య అవినీతిని ఆధారాలతో అందరికి తెలిసేలా చేశాడు. దివ్య పలు కాంట్రాక్ట్ లు ఇవ్వడనికి పలువురు కాంట్రాక్టర్ల నుంచి లంచం తీసుకున్నట్లు చెప్పాడు.

అవినీతి సొమ్మును భార్య ఇంట్లో సమయంలో వీడియో తీశాడు. ఇంట్లో ఎక్కడెక్కడ డబ్బు, బంగారం ఉందో వాటిని వీడియో తీశాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో నోట్ల కట్టలు భారీగా కనిపించాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భార్య తన తమ్ముడికి ఇప్పటికే రూ1.1 కోట్ల లంచం డబ్బును అప్పుగా ఇచ్చిందని శ్రీపాద్ ఆరోపించారు. తన భార్యను పద్ధతి మార్చుకోవాలని ఎన్నిసార్లు చెప్పిన వినిపించుకోలేదని చెప్పాడు. దివ్య అవినీతి ఇంకా పెరిగిపోవడంతో వీడియో విడుదల చేసినట్లు చెబుతున్నారు.
ప్రస్తుతం ఈ వీడియోపై ఉన్నతాధికారులు స్పందించాల్సి ఉంది. ఆమె ఇంట్లో ఏసీబీ తనిఖీలు చేయాలని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. శ్రీపాద్ నువ్వే అలైన భారతీయుడు అంటూ కామెంట్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications