Crime News: బాలిక గ్యాంగ్ రేప్ కేసులో బయటపడ్డ సంచలన విషయాలు..
హైదరాబాద్ నగర శివారు హయత్ నగర్ పరిధిలో బాలికపై జరిగిన గ్యాంగ్ రేప్ లో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి.
పాఠశాలలో పదోతరగతి చదువుతున్న విద్యార్థినిపై, ఐదుగురు తోటి విద్యార్థులు అత్యాచారం చేశారు. హయత్ నగర్ పరిధిలోని ఓ రహస్య ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ అత్యాచారానికి తెగబడ్డారు. అంతటితో ఆగకుండా అత్యాచార ఘటననుమొబైల్ లో చిత్రీకరించారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. అత్యాచారం చేసిన ఐదుగురు మైనర్లే.. వీరు మొబైల్లల్లో పోర్న్ వీడియోలు చూసేవారు. వీడియోలు ఉన్నట్లు చేయాలని నిర్ణయించుకున్న వారు తోటి స్నేహితురాలిపై ఘాతుకానికి తెగపడ్డారు.
నిందితుల్లో ఒకడైన 10వ తరగతి చదివే ఓ బాలుడు తన తల్లిదండ్రుల స్మార్ట్ ఫోన్ తీసుకుని పోర్న్ వీడియోలు చేసేవాడని పోలీస్ విచారణలో తేలినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ బాలుడు ఆ వీడియోలను తన స్నేహితులకు చూపించాడు. ఇలా వీడియోలకు ఆకర్షితులైన వారు తరుచుగా వాటిని చూసేవారు.

ఇలా వారు వీడియోల్లో ఉన్నట్లుగా చేయాలని భావించారు. ఇందు కోసం పదో తరగతి బాలికను ఎంచుకున్నారు. బాలికను పుస్తకం పేరుతో ఇంటికెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారాన్ని మొబైల్ చిత్రీకరించారు కూడా.












Click it and Unblock the Notifications