MMTS: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. ఎంఎంటీఎస్‍తో పాటు పలు రైళ్లు రద్దు..

మీరు ఎంటీఎస్ రైళ్లలో ఎక్కువగా ప్రయాణిస్తారా.. అయితే మీరు ఓ విషయం తెలుసుకోవాలి. జులై 3 నుంచి 9 తేదీ వరకు వివిధ మార్గాల్లో ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్ల పరిధిలో జరుగుతున్న ట్రాక్ మెయిటెనెన్స్ పనుల కారణంగా ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

లింగంపల్లి - ఉందానగర్ 3 రైళ్లు, లింగంపల్లి - హైదరాబాద్, హైదరాబాద్ - లింగంపల్లి మధ్య నడిచే 10 రైళ్లు, లింగంపల్లి - ఫలక్ నుమా 2, ఉందానగర్ - లింగంపల్లి 4, ఫలక్ నుమా - లింగంపల్లి 2, రామచంద్రాపురం - ఫలక్ నుమా మధ్య నడిచే ఒక రైలును రద్దు చేస్తున్నట్లు చెప్పారు. ఎంఎంటీఎస్ రైళ్లతో పాటు కొన్ని సాధారణ రైళ్లను కూడా రద్దు చేశారు.

 MMTS:

బల్లార్షా- కాజీపేట, భద్రాచలం - బల్లార్షా, సిర్పూర్ టౌన్ - భద్రాచలం, కాజీపేట - బల్లార్షా, కాచిగూడ - నిజామాబాద్, నిజామాబాద్- నాందేడ్, విజయవాడ- భద్రాచలం, కాజీపేట- డోర్నకల్, విజయవాడ - డోర్నకల్, భద్రాచలం- విజయవాడ, సికింద్రాబాద్- వికారాబాద్, వికారాబాద్- కాచిగూడ, సికింద్రాబాద్- వరంగల్, వరంగల్- హైదరాబాద్, సిర్పూర్ టౌన్ - కరీంనగర్, కరీంనగర్ - నిజాబాబాద్, కాజీపేట- సిర్పూర్ టౌన్ మధ్య నడిచే రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

 MMTS:

కాచిగూడ -మహబూబ్ నగర్ మధ్య నడిచే ఎక్స్ ప్రెస్ ఉందానగర్ వరకు మాత్రమే నడుపుతారు. నాందేడ్- నిజామాబాద్​-పండర్​పూర్ ఎక్స్​ప్రెస్ ను ముత్కేడ్ వరకు మాత్రమే నడుస్తుందనని రైల్వే అధికారులు తెలిపారు. రైల్వే శాఖకు ప్రయాణికులు సహరించాలని కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+