తెలంగాణ భవన్‌లో అగ్నిప్రమాదం... 'ఎమ్మెల్సీ' గెలుపు సంబరాల్లో అపశృతి...

హైదరాబాద్‌లోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవి ఘనవిజయం సాధించడంతో పార్టీ శ్రేణులు అక్కడ బాణసంచా కాల్చారు. ఈ క్రమంలో బాణసంచా నిప్పు రవ్వలు పక్కనే ఉన్న ఎండిపోయిన చెట్లపై పడ్డాయి. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.

వెంటనే అప్రమత్తమైన టీఆర్ఎస్ శ్రేణులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కార్యకర్తల అత్యుత్సాహమే అగ్ని ప్రమాదానికి కారణమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

massive fire break out in trs party office telangana bhavan in hyderabad

కాగా,ఎమ్మెల్సీగా సురభీ వాణి దేవి విజయంతో టీఆర్ఎస్ శ్రేణుల్లో కోలాహలం నెలకొంది. అటు వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల స్థానంలో దాదాపుగా టీఆర్ఎస్ విజయం ఖరారవడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. దుబ్బాక,జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటముల తర్వాత ఢీలా పడ్డ పార్టీ క్యాడర్‌లో ఈ విజయం కొత్త జోష్ నింపుతోంది. ఇదే ఊపుతో నాగార్జునసాగర్ ఉపఎన్నికను కూడా కైవసం చేసుకుంటామని ఆ పార్టీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+