హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సికింద్రాబాద్‌లో ఘోర అగ్నిప్రమాదం: 11 మంది సజీవదహనం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 11 మంది సజీవదహనం అయ్యారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. కాలిన గాయాలతో ఆసుపత్రిలో చేరారు. మృత్యువుతో పోరాడుతున్నారు. ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టమ్ కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

సికింద్రాబాద్‌ బోయిగూడలో ఈ ఘటన చోటు చేసుకుంది. బోయిగూడలోని ఓ టింబర్‌ డిపోలో ఈ తెల్లవారు జామున మంటలు చెలరేగాయి. టింబర్ డిపో కావడం వల్ల క్షణాల్లో అగ్నికీలలు వ్యాపించాయి. మంటలు శరవేగంగా వ్యాపించడానికి రంపపు పొట్టు కారణమైంది. పెద్ద ఎత్తున అగ్నికీలలు ఎగసిపడ్డాయి. టింబర్ డిపోలో పని చేస్తోన్న 11 మంది కార్మికులు సజీవ దహనం అయ్యారు. మరో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాద సమయంలో టింబర్‌ డిపోలో 15 మంది వరకు కార్మికలు ఉన్నారని తెలుస్తోంది.

Massive fire breaks out in Secunderabad, 11 charred to death

మృతులందరూ బిహార్‌కు చెందిన వలస కార్మికులుగా గుర్తించారు. వారందరూ టింబర్ డిపోలోనే నిద్రించారు. సమాచారం అదుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎనిమిది ఫైరింజిన్లతో మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తున్నారు. ఈ ఘోర దుర్ఘటన చోటు చేసుకోవడానికి గల కారణాలు ఇంకా తెలియ రాలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు చేపట్టారు.

ఈ ఘటనలో టింబర్ డిపో మొత్తం కాలి బూడిద అయింది. అక్కడ పార్క్ చేసి ఉంచిన వాహనాలు పూర్తిగా దగ్ధం అయ్యాయి. నిల్వ ఉంచిన దుంగలు, వాటిని కత్తిరించడానికి ఉపయోగించే భారీ సామాగ్రి మొత్తం మసి అయింది. కోట్ల రూపాయల మేర ఆస్తినష్టం సంభవించినట్లు అంచనా వేస్తోన్నారు. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

English summary
Massive fire breaks out in Secunderabad, 11 charred to death
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X