మెడికో ప్రీతి బ్రెయిన్ డెడ్- తీవ్ర ఉద్రిక్తత..

సీనియర్ సైఫ్ వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడిన మెడికో ప్రీతి బ్రెయిన్ డెడ్ కు గురైనట్లు ఆమె తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆమె హైదరాబాద్ నిమ్స్ లో చికిత్స పొందుతున్నారు.

హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లోసంచలనం రేపిన వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ విద్యార్ధిని డాక్టర్ ప్రీతి ఉదంతం విషాదాంతంగా ముగిసేలా ఉంది. ఆమె ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఆమె జీవించే అవకాశం చాలాతక్కువగా ఉన్నట్లు నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెన్ డాక్టర్లు వెల్లడించారు. ఆమె బ్రెయిన్ డెడ్ కు గురైనట్లు డాక్టర్లు తనతో చెప్పారని మెడికో ప్రీతి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులు హత్యనేరం కింద కేసు నమోదు చేయాలంటూ డిమాండ్ చేశారు.

జనగామ జిల్లాకు చెందిన వరంగల్ కాకతీయ వైద్య కళాశాలలో అనస్థీసియాలో మొదటి సంవత్సరం పీజీ చదువుతున్న ప్రీతి ఆత్మహత్యకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. మహాత్మాగాంధీ మెమోరియల్ ఆసుపత్రిలో శిక్షణలో ఉన్న సమయంలో తెల్లవారు జామున 6:30 గంటలకు విషపూరిత ఇంజక్షన్‌ తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

Telangana Women Medico Preethi, who attempts suicide over harassment by senior, was reportedly brain dead.

అపస్మారక స్థితిలో ఉన్న ప్రీతిని గుర్తించిన ఆసుపత్రి డాక్టర్లు ఆమెకు ఐసీయూకు తరలించి చికిత్స అందించారు. ఆమె ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో హైదరాబాద్‌ నిమ్స్‌కు తరలించారు. నిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. సైఫ్ అనే సీనియర్ మెడికో స్టూడెంట్ వేధింపుల కారణంగానే ప్రీతి ఆత్మహత్య యత్నంచినట్టుగా పోలీసులు నిర్ధారించారు. అతనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, ర్యాగింగ్ నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం అతను రిమాండ్ లో ఉన్నాడు.

ఇదిలావుండగా- నిమ్స్ లో చికిత్స పొందుతున్న ప్రీతి ఆరోగ్యం రోజురోజుకూ విషమిస్తూ వచ్చింది. అత్యాధునిక వైద్య చికిత్సను అందించినప్పటికీ ఆమె కోలుకోలేకపోయారు. ఈ సాయంత్రం ఆమె బ్రెయిన్ డెడ్ కు గురైనట్లు వార్తలొచ్చాయి. ప్రీతి తండ్రి స్వయంగా ఈ విషయాన్ని విలేకరులకు వెల్లడించారు. తన కుమార్తె జీవించడం కష్టమేనని డాక్టర్లు చెబుతున్నారంటూ కన్నీరుమున్నీరు అయ్యరు. చికిత్సకు ప్రీతి శరీరం స్పందించట్లేదని పేర్కొన్నారు.

తన కుమార్తెను ఈ దుస్థితికి తీసుకొచ్చిన సైఫ్ పై హత్యకేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ప్రీతి బ్రెయిన్ డెడ్ కు గురైనట్లు నిమ్స్ డాక్టర్లు ఇంకాస్సేపట్లో ప్రకటించే అవకాశం ఉంది. హెల్త్ బులెటిన్ ను ప్రకటించిన అనంతరం ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందనే కారణంతో నిమ్స్ వద్ద భద్రతను పెంచారు. ఇప్పటికే నిమ్స్ వద్దకు పలువురు చేరుకున్నారు. వివిధ విద్యార్థి సంఘాల నాయకులు, మీడియా ప్రతినిధులతో నిమ్స్ ఆవరణ నిండిపోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+