స్వదేశీ విధానం.. ఆత్మనిర్భర్ భారత్ అంటే ఇదేనా, మోడీ జీ: మంత్రి కేటీఆర్
సమయం దొరికితే చాలు టీఆర్ఎస్- బీజేపీ విమర్శలు చేసుకుంటున్నాయి. ముఖ్యనేతలు కూడా మాటల యుద్దానికి దిగుతున్నారు. ప్రధాని మోడీపై మంత్రి కేటీఆర్ ఫైరయ్యారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. ఆనాడు గాంధీ స్వదేశీ స్ఫూర్తిని ప్రజల్లో పెంపొందించడానికి ఆత్మనిర్బర్ చిహ్నంగా చరఖా ఉపయోగించారని గుర్తుచేశారు. మరీ ఇప్పుడు చేనేత, ఖాదీ వస్త్ర ఉత్పత్తులపై జీఎస్టీ విధించారని ఫైరయ్యారు. ఆత్మనిర్భర్ భారత్ ఇదేనా అని ప్రశ్నించారు.
జాతికి తెలియజేసే స్వదేశీ విధానం ఇదేనా అని కేటీఆర్ అడిగారు. ఈ నెల 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవం అనే సంగతి తెలిసిందే. ప్రభుత్వం కానుకగా ప్రకటించిన నేతన్న బీమా పథకంపై బండి సంజయ్ చేసిన కామెంట్లను మంత్రి కేటీఆర్ తిప్పికొట్టారు. ఎనిమిదేళ్లలో చేనేత కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. ఏమీ చేయలేదని.. అదీ వారికి కూడా తెలుసు అని చెప్పారు. ఎప్పుడూ కబుర్లు చెబుతూ కాలం వెళ్లదీయడమే పనిగా పెట్టుకున్నారని తెలిపారు.

ఎంపీగా గెలిచిన బండి సంజయ్ కరీంనగర్ జిల్లాకు ఏం చేశారని మంత్రి కేటీఆర్ అడిగారు. ఏమీ లేదని విరుచుకుపడ్డారు. సొంత నియోజకవర్గ పరిధిలో గల సిరిసిల్లలో మెగా పవర్ లూం క్లస్టర్ కూడా మంజూరు చేయించలేని నిస్సహాయ ఎంపీ బండి సంజయ అని కేటీఆర్ విమర్శించారు. పైకి విమర్శలు మాత్రం చేస్తారని ధ్వజమెత్తారు. ఇదీ సరికాదని.. వారు చేసే మాటలను జనం చూస్తున్నారని వివరించారు.
తెలుగు రాష్ట్రాలు.. పార్లమెంట్ ఎన్నికలకు సమయం ఉన్నా.. నేతలు మాత్రం తెగ హడావిడి చేస్తున్నారు. సర్వేలు రిపోర్టులు రావడం.. వాయిస్ పెంచడం చేస్తూనే ఉన్నారు. ఏదో ఒక అంశం మీద మాట్లాడుతూనే ఉన్నారు.












Click it and Unblock the Notifications