హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గిరిజన బిడ్డ చదువుకు కేటీఆర్ సాయం.. అండగా ఉంటానని భరోసా

|
Google Oneindia TeluguNews

ఆదుకోవాలని కోరితే చాలు మంత్రి కేటీఆర్ ఆపన్నహస్తం అందిస్తారు. తనకు విషయం తెలిస్తే చాలు వెంటనే రియాక్ట్ అవుతారు. అలా కోయ తెగ‌కు చెందిన నిరుపేద విద్యార్థినికి అండ‌గా నిలిచారు. ఐఐటీలో సీటు సాధించిన ఆ స‌ర‌స్వ‌తి పుత్రిక‌ విద్యాభ్యాసం పూర్త‌య్యే వ‌ర‌కు తాను బాధ్య‌త తీసుకుంటాన‌ని కేటీఆర్ భ‌రోసానిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం మామిడి గూడెం కి చెందిన శ్రీలత చిన్ననాటి నుంచి చదువులో అద్భుతమైన ప్రతిభను ప్రదర్శిస్తు వచ్చేది.

ఇంటర్మీడియట్లో 97 శాతం మార్కులను సాధించింది. నాగ‌ర్‌క‌ర్నూల్‌లోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో విద్య‌ను అభ్య‌సించింది. ఆ తర్వాత ఐఐటి వారణాసిలో ఇంజినీరింగ్ సీట్ సంపాదించింది. ఆమె త‌ల్లిదండ్రులు వ్య‌వ‌సాయ కూలీలు అనే సంగతి తెలిసిందే. ఇంజినీరింగ్ చ‌దువుకు ఫీజులు చెల్లించే స్తోమ‌త ఆ కుటుంబానికి లేదు. దీంతో శ్రీల‌త ప‌రిస్థితి కేటీఆర్ దృష్టికి వ‌చ్చింది. వెంట‌నే శ్రీల‌త‌తో పాటు ఆమె కుటుంబ స‌భ్యుల‌ను కేటీఆర్ ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు పిలిపించి, ఇంజినీరింగ్ విద్య పూర్త‌య్యే వ‌ర‌కు అండ‌గా ఉంటాన‌ని హామీ ఇచ్చారు.

minister ktr helps to tribal student

శ్రీల‌త ఉన్న‌త విద్య‌ పూర్తయ్యే వరకు తాను బాధ్యత తీసుకుంటున్నట్లు కుటుంబ సభ్యులకు కేటీఆర్ భరోసా ఇచ్చారు. నిరుపేద పరిస్థితుల్లో అనేక సవాళ్లు దాటుకొని ఐఐటీలో సీటు సాధించిన శ్రీలత ప్రస్థానం లక్షలాది మందికి ఒక స్ఫూర్తిగా నిలుస్తుందని కేటీఆర్ అన్నారు. ప్రజ్ఞాపాటవాలు ఎవరి సొత్తు కాదని, కృషితో ఏలాంటి లక్ష్యాన్నైనా సాధించవచ్చనే విషయాన్ని శ్రీలత నిరూపించిందని కేటీఆర్ అన్నారు. శ్రీలత లాంటి ఒక అద్భుతమైన టాలెంట్ ఉన్న ఆడబిడ్డకి అండగా నిలవడం తనకు అత్యంత సంతోషాన్ని, సంతృప్తిని ఇస్తుందని కేటీఆర్ అన్నారు.

Recommended Video

రాష్ట్రంలో చిన్నారులపై అకృత్యాలు కొనసాగుతూనే ఉన్నాయన్న మహిళా కాంగ్రెస్ || Oneindia Telugu

ఐఐటీ విద్యకు అవసరమైన డబ్బులను అందించారు. భవిష్యత్తులోనూ శ్రీలతకు అండగా నిలుస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఐఐటీలోనూ మరింత ప్రతిభ చాటాలని ఆమెకు కేటీఆర్ సూచించారు. త‌న ఇంజినీరింగ్ విద్య‌కు సాయ‌మందించిన కేటీఆర్‌కు శ్రీల‌త‌, ఆమె త‌ల్లిదండ్రులు ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఆయనకు తాము జీవితాంతం రుణ‌ప‌డి ఉంటాన‌ని శ్రీల‌త పేర్కొన్నారు.

English summary
telangana minister ktr helps to tribal student srilatha who study iit at varanasi.ఆదుకోవాలని
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X