కవితకు ఈడీ సమన్లు - తేల్చి చెప్పిన మంత్రి కేటీఆర్..!!
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసుల పై మంత్రి కేటీఆర్ స్పందించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసుల పై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఇవి ఈడీ కాదు మోదీ సమన్లుగా అభివర్ణించారు. ఎనిమిదేళ్లుగా జూమ్లా లేదంటే హమ్లా అన్నట్లుగా ప్రహసనం సాగుతోందన్నారు. పార్టీకి చెందిన పలువురి నేతల పైన విచారణ సంస్థలు నిరంతరం కేసుల పేరుతో వేధిస్తున్నాయని ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితకు నోటీసులు ఇవ్వటం రాజకీయంగా చిల్లర ప్రయత్నంగా కేటీఆర్ పేర్కొన్నారు. మోదీ హయాంలో ఇప్పటి వరకు విచారణ సంస్థలు 5422 కేసులు నమోదు చేసాయని.. 23 కేసులు మాత్రమే తేల్చారని వివరించారు. కవిత విచారణ ఎదుర్కొంటారని..తమకు న్యాయ వ్యవస్థ పైన నమ్మకం ఉందని కేటీఆర్ స్పష్టం చేసారు.

9 రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూల్చేసారు
బీజేపీ అధికారంలో లేని 9 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చి వేసారని కేటీఆర్ ఫైర్ అయ్యారు. ముంద్రా ఏయిర్ పోర్టులో 21 వేల కోట్ల హెరాయిన్ పట్టుకుంటే కేసు లేదని విమర్శించారు. బీజేపీలో చేరితో కేసులు అన్నీ పోతాయని.. ఎల్ఐసీ కోట్లాది రూపాయాలు నష్టపోతే ప్రధాని, ఆర్దిక మంత్రి ఎందుకు స్పందించరని నిలదీసారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న అన్ని పార్టీల పైన కేసులు పెట్టారంటూ లెక్కలు బయట పెట్టారు. అందులో కాంగ్రెస్ 24, టీఎంసీ 19. ఎన్సీపీ 11, డీఎంకే పైన 6 , ఆప్, వైసీపీ పైన 3 కేసులు నమోదయ్యాయని వివరించారు. డబుల్ ఇంజన్ అంటే ఒకటి మోదీ - రెండోది ఆదానీ గా కేటీఆర్ విశ్లేషించారు. బీజేపీకి చెందిన వారి పైన ఒక్క కేసు కూడా ఎందుకు లేదని ప్రశ్నించారు.

లిక్కర్ స్కాంలో అభియోగం అర్దం లేనిది
లిక్కర్ స్కాం లో పాలసీ కొందరి కోసం తయారు చేసారనేది అభియోగమని కేటీఆర్ చెప్పుకొచ్చారు. గౌతమ్ ఆదానీ కోసం ఆరు విమానాశ్రయాలు దక్కేలా పాలసీ తయారు చేయటం స్కాం కాదా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఆదానీ విదేశాల్లో బొగ్గు మైనింగ్ చేస్తుంటే విదేశీ బొగ్గు కొనుగోలు చేయాలని పాలసీ తేవటం కుంభకోణం కాదా అని నిలదీసారు. ఏపీలో గంగవరం పోర్టు లాక్కోవాలనుకుంటే అది స్కాం కాదా అని వరుసగా ప్రశ్నలు సంధించారు. బీఎల్ సంతోష్ లాంటి వాళ్లు కేసులు పెట్టగానే దాక్కునున్నారని..విచారణకు రాలేదని చెప్పారు. తాము బాధ్యత గల భారత పౌరులుగా చట్టాన్ని గౌరవిస్తామని చెప్పారు. కవిత విచారణ ఎదుర్కొంటారని..తమకు న్యాయ వ్యవస్థ పైన నమ్మకం ఉందని కేటీఆర్ వివరించారు.
అదానీ మీద ఏ కేసు ఉండదు..
అవినీతికి పాల్పడే అదానీ మీద ఏ కేసు ఉండదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అదానీకి చెందిన ముంద్రా పోర్ట్‌లో 21 వేల కోట్ల విలువ చేసే హెరాయిన్ దొరికితే కేసు కాలేదన్నారు. అదానీని విచారించే దమ్ము దర్యాప్తు సంస్థలకు ఉందా అంటూ ప్రశ్నించారు. ఆదానీ ఎవరి బినామీ అని కేటీఆర్ ప్రశ్నించారు. ఎల్ఐసీ, ఎస్బీఐకి చెందిన రూ. 13 లక్షల కోట్ల డబ్బులు ఆవిరైనా కేంద్రం ఎందుకు స్పందించదని నిలదీసారు. బినామీని కాపాడుకునే బాధ్యత వారిపై ఉంది కాబట్టి స్పందించడం లేదు అని కేటీఆర్ నిప్పులు చెరిగారు. బీజేపీలో చేరగానే కేసులన్ని ఏమై పోతున్నాయని కేటీఆర్ ప్రశ్నించారు. కర్ణాటకలో అత్యంత అవినీతి ప్రభుత్వం ఉందని పత్రికలు చెబుతున్నాయి. మోదీ - అదానీ స్నేహం గురించి అందరికీ తెలుసు అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications