KTR: సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన కేటీఆర్.. అందులో ఏముందంటే..!

ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ కు సంబంధించి ఓ వీడియో ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన వారు.. అందులో ప్రదేశానికి ఎప్పుడు వెళ్లాల అని ఎదురు చూస్తున్నారు. ఇంతకీ కేటీఆర్ ఏం వీడియో పోస్ట్ చేశారంటే.. జలవహార్ పక్కన దాదాపు 10 ఎకరాల్లో లేక్ ఫ్రంట్ పార్క్ ను హెచ్ఎండీఏ అభివృద్ధి చేసింది. ఈ పార్క్ కు సంబంధించిన వీడియోను కేటీఆర్ పోస్ట్ చేశారు. ఈ పార్క్ అందుబాటులోకి వస్తే.. సిటీకి మరో అట్రాక్షన్ జోన్ గా మారనుంది.

ఇప్పటికే హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ భారీగా పర్యటకులు వస్తున్నారు. హుస్సేన్ సాగర్ ఒకవైపు సెక్రటేరియట్, అమరవీరుల స్థాపం ఉంది. అలాగే అంబేడ్కర్ విగ్రహం, ఎన్టీఆర్ పార్క్, లుంబీని పార్క్ ఉంటాయి. వీటితో పాటు జలవిహార్ పక్కన పార్క్ అందుబాటులోకి వస్తే పర్యటకుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. ఈ లేక్ ఫ్రంట్ పార్క్ హైదరాబాద్ కు కొత్త ఆందమని కేటీఆర్ అన్నారు. ఈ పార్క్ తో సెంట్రల్ హైదరాబాద్ మరింత కల సంతరించుకుంటుందన్నారు.

Minister KTR posted the video of Lake Front Park on social media

హుస్సేన్ సాగర్ చుట్టూ జలవిహార్ పక్కన దాదాపు 10 ఎకరాల్లో ఈ లేక్ ఫ్రంట్ పార్క్ ను ఏర్పాటు చేశారని చెప్పారు. దీన్ని హెచ్ఎండీఏ అభివృద్ధి చేసినట్లు వివరించారు. త్వరలో ఈ పార్కును ప్రారంభించబోతున్నట్లు చెప్పారు. మీరందరూ అందమైన బోర్డు వాక్ ను సందర్శించి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నట్లు కేటీఆర్ ట్వీట్ చేశారు. కేటీఆర్ ట్వీట్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పార్కును హెచ్ఎండీఏ సుమార్ రూ.15 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

ఈ పార్కులో అండర్‌పాస్‌లతో కూడిన ఎత్తైన నడక మార్గాలు, కాలినడక దారులు, సీటింగ్‌తో కూడిన వాటర్ ఛానల్ డెక్, హుస్సేన్ సాగర్‌పై విస్తరించి ఉన్న గ్లాస్ డెక్, లేక్‌ఫ్రంట్ పార్క్ కోసం వేవ్ లాంటి కర్విలినియర్ డిజైన్‌లు కూడా ఉన్నాయి. పార్కులో ఆకట్టుకునేలా ఏర్పాటు చేసిన లైటింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అలాగే పార్కులో పిల్లల కోసం ఆట స్థలం, సీటింగ్‌తో కూడిన పెర్గోలాస్ ఏర్పాటు చేశారు. ముంబైకి చెందిన ల్యాండ్‌స్కేప్ ఆర్కిటెక్ట్ కిషోర్ డి ప్రదాన్‌ ఈ పార్క్ అభివృద్ధి, సుందరీకరణ పనులు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+