ఐటీ ఉద్యోగులకు ట్రాఫిక్ నుంచి రిలీఫ్: కొత్తగూడ ఫ్లైఓవర్ ప్రారంభం, కేటీఆర్ ఏమన్నారంటే?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ నగరం కల్పతరువు లాంటిదని.. అందరికీ ఉపాధిస్తుండటంతో ఇక్కడ అన్ని వసతులు కల్పిస్తున్నామని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ కొత్తగూడ నుంచి కొండాపూర్ వరకు ఎస్ఆర్డీపీ కింద రూ. 263 కోట్ల వ్యయంతో సుమారు 3.3 కిలోమీటర్ల పొడవుతో నిర్మించిన ఫ్లైఓవర్‌ను ఆదివారం మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి కేటీఆర్ ప్రారంభించారు.

ఆ ఘనత కేసీఆర్‌దేనన్న కేటీఆర్
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. దేశంలో ఏ నగరంలో లేనంత అభివృద్ధి హైదరాబాద్‌లో జరుగుతుందని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఏకకాలంలో అభివృద్ధి, సంక్షేమం లక్ష్యాలతో ముందుకెళ్తున్నామని అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. కరెంటు సమస్యను తీర్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనన్నారు.

రాబోయే 50ఏళ్లకు సరిపడా మంచినీళ్ల సప్లైకి ప్రణాళికలు
రాబోయే 50 ఏళ్ల వరకు మంచినీటి కొరత లేకుండా ప్రణాళికలు రచిస్తున్నామన్నారు కేటీఆర్. కాళేశ్వరం, సుంకిశాల ప్రాజెక్టులను మంచినీటి సరఫరాకు ఏర్పాటు చేశామని వివరించారు మంత్రి కేటీఆర్. ఎస్ఆర్డీపీ కింద చేపట్టిన ప్రాజెక్టుల్లో దాదాపు 20 పూర్తి చేశామన్నారు. వ్యూహాత్మక నాలాల అభివృద్ధి ప్రాజెక్టు కూడా చేపట్టామని తెలిపారు. మార్చి, ఏప్రిల్ నాటికి స్ట్రాటజిక్ నాలా కార్యక్రమం పూర్తిచేస్తామన్నారు. వంద శాతం సీవరేజ్ ట్రీట్‌మెంట్ కోసం 31 ఎస్టీపీలను నిర్మిస్తున్నామని వెల్లడించారు. దీంతో దేశంలోనే తొలి వందశాతం సీవరేజ్ ట్రీట్‌మెంట్ సిటీగా హైదరాబాద్ అవతరించబోతున్నదని చెప్పారు.

అభివృద్ధిని ప్రజలు గుర్తించాలన్న కేటీఆర్
హైదరాబాద్ నగరానికి 3వేల ఎలక్ట్రిక్ బస్సులు తీసుకురానున్నామని కేటీఆర్ చెప్పారు. అభివృద్ధి సంక్షేమం అనే లక్ష్యాలతో ముందుకు సాగుతున్నామన్నారు. హైదరాబాద్ నగరంలో రూ. 8వేల కోట్లకుపైగా నిధులతో ప్రాజెక్టులు చేపట్టామన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి చేసేది ఇంకా ఉందని.. కానీ చేసింది కూడా ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు మంత్రి కేటీఆర్.

కొత్తగూడ ఫ్లైఓవర్‌తో ఐటీ ఉద్యోగుల కష్టాలకు చెక్
బొటానికల్ గార్డెన్, కొత్తగూడ, కొండాపూర్ జంక్షన్లకు ఇరువైపులా భారీ కమర్షియల్ భవనాలు ఉన్నాయి. పరిసర ప్రాంతాల్లో అనేక సాఫ్ట్‌వేర్ కంపెనీలున్నాయి. ఈ జంక్షన్లలో ఉదయం, సాయంత్రం వేళల్లో భారీ రద్దీ ఏర్పడుతుంది. అయితే, ఈ కొత్తగూడ ఫ్లైఓవర్ రావడంతో బొటానికల్ గార్డెన్ జంక్షన్, కొత్తగూడ జంక్షన్లలో వంద శాతం సమస్యకు శాశ్వత పరిష్కారం లభించినట్లయింది. కొండాపూర్ జంక్షన్లలో 65 శాతం మేర ట్రాఫిక్ నుంచి విముక్తి లభించింది. నూతన సంవత్సరం ప్రారంభ రోజున ఈ ఫ్లైఓవర్ ప్రారభించడంతో ఐటీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ ట్రాఫిక్ కష్టాలు కొంతమేర తీరతాయని అంటున్నారు.
-
రాష్ట్రంలో భారీగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. -
Praful Hinge: తొలి మ్యాచ్, తొలి ఓవర్లోనే అద్భుతం-చరిత్ర సృష్టించిన హైదరాబాద్ కొత్త బౌలర్..! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..!












Click it and Unblock the Notifications