సబితమ్మ మంచి మనస్సు.. చెప్పుల్లేకుండా నడుస్తోన్న స్టూడెంట్స్.. కాన్వాయ్ ఆపి మరీ..
మంత్రి సబితా ఇంద్రారెడ్డి తన గొప్ప మనసును చాటుకున్నారు. దారిలో విద్యార్థులు చెప్పులు లేకుండా నడవడాన్ని చూశారు. చలించిపోయి.. కారును ఆపారు. సమస్య ఏంటో తెలుసుకున్నారు. తర్వాత డిక్షనరీలు అందజేశారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా ధారూర్ మండలంలో జరిగింది. ఆ ఫోటోలు, వీడియోలు ట్రోల్ అవుతున్నాయి. వావ్.. విద్యాశాఖ మంత్రి అని అంతా అంటున్నారు.
Recommended Video
చెప్పులు లేకుండా వెళ్తున్న విద్యార్థులను సబితా ఇంద్రారెడ్డి చూశారు. తన కాన్వాయ్ ఆపివేశారు. అసలు సమస్య ఏంటీ అని అడిగారు. వారు చెప్పిన సమాధానం విని ఆశ్చర్యపోయారు. బురదలో చెప్పులు పాడైతాయని వేసుకోలేదని చెప్పడంతో ఒకింత షాక్ నకు గురయ్యారు. తమ ఇంట్లో చెప్పులు ఉన్నాయని చెప్పారు. కానీ మీరు చప్పల్ వేసుకోకపోతే కాళ్ళు పాడైతాయని విద్యార్థికి సూచించారు.
#Video: సబితమ్మ మంచి మనస్సు.. చెప్పుల్లేకుండా నడుస్తోన్న స్టూడెంట్స్.. కాన్వాయ్ ఆపి మరీ..#Telangana #SabithaIndraReddy pic.twitter.com/ZjGU09alm0
— oneindiatelugu (@oneindiatelugu) August 30, 2022
మంగళవారం సాయంత్రం పాఠశాల వదలటంతో విద్యార్థులు అంతా రోడ్డు పక్కన నుండి నడుస్తూ వస్తున్నారు. తాండూరులో కార్యక్రమాలు ముగించుకొని నగరానికి వెళ్తున్న మంత్రికి ఒక విద్యార్థి కాళ్లకు చెప్పులు లేకుండా నడుస్తూ రావడం గమనించారు. ఆమె చలించిపోయి కార్ అపి ఆ విద్యార్థి వద్దకు వచ్చారు. ఇంట్లో చెప్పులు ఉన్నాయని తెలుసుకున్నారు. ప్రతి రోజు పాఠశాలకు వేసుకొని వెళ్లాలని సూచించారు. ఆ విద్యార్థితో పాటు అందరికి డిక్షనరీలు అందించారు. మీరంతా చక్కగా చదువుకోవాలని కోరారు.

మంత్రులు, నేతలు బిజీగా ఉంటారు. రోడ్డు పక్కన వెళ్లే సమయంలో పట్టించుకోవడం రేర్.. కానీ సబితా అలా కాదు.. విద్యార్థులను పట్టించుకున్నారు. చెప్పులు లేకుండా నడవొద్దు అని సూచించారు.












Click it and Unblock the Notifications