మిథాని-ఓవైసీ ఫ్లై ఓవర్ ప్రారంభం.. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పేరు,

విశ్వనగరి హైదరాబాద్‌లో ట్రాఫిక్ చిక్కులు తప్పవు. ప్రధాన కూడళ్ల వద్ద జామ్ తిప్పలు పడాల్సిందే. దీంతో ఫ్లై ఓవర్ల నిర్మాణం చేపట్టారు. అయితే కొన్ని చోట్ల మాత్రం ఫ్లై ఓవర్ లేక ఇబ్బందులు తప్పలేదు. దీంతో వాటిపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ చేసింది. ఫ్లై ఓవర్లు నిర్మిస్తూ వస్తున్నారు. ఇటీవల బాలానగర్ ఫ్లై ఓవర్ అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఆ ఏరియాలో ఉండేవారికి ట్రాఫిక్ బాధ తప్పింది. ఇప్పుడు మిథాని-ఓవైసీ జంక్షన్ వద్ద మరో ఫ్లై ఓవర్ నిర్మించి.. ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు.

హమ్మయ్యా..

హమ్మయ్యా..

హైదరాబాద్‌లో ఇప్పటికే పలు ఫ్లైఓవర్లు అందుబాటులోకి రాగా.. ఇవాళ్టి నుంచి ఒవైసీ ఫ్లైఓవర్‌ అందుబాటులోకి వచ్చింది. ఈ ఫైఓవర్‌ అందుబాటులోకి వస్తుండడంతో మిధాని జంక్షన్‌ వైపు నుంచి ఎల్‌బీనగర్‌ వైపు వెళ్లే వారికి రిలీఫ్ కలిగింది. మిథాని, ఒవైసీ జంక్షన్ల వద్ద ప్రస్తుతం ఎదురవుతున్న ఇబ్బందులు తప్పనున్నాయి. డీఆర్‌డీఓ, డీఆర్‌డీఏ, ASL తదితర కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ట్రాఫిక్‌ సమస్యలు తగ్గుతాయి. ఈ ఫ్లైఓవర్‌ తూర్పు ప్రాంతానికి, పాతబస్తీకి వారధిగా నిలుస్తుందని అధికారులు చెబుతున్నారు. ఆరాంఘర్‌ నుంచి ఎల్‌బీనగర్‌ మార్గంలో కూడా ఇబ్బందులు తప్పనున్నాయి.

రూ.80 కోట్ల వ్యయం

రూ.80 కోట్ల వ్యయం

80 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఫ్లై ఓవర్‌లో క్రాష్‌ బారియర్స్, ఫ్రిక్షన్‌ శ్లాబ్స్, శ్లాబ్‌ పానెల్స్‌ లాంటి పనులకు ఆర్‌సీసీ ప్రీకాస్ట్‌ టెక్నాలజీ వాడారు. దీని వల్ల ఎంతో సమయం కలిసి రావడంతోపాటు మ్యాన్‌పవర్‌ తగ్గిందని, పని ప్రదేశంలో ప్రమాదాల రిస్క్‌ తగ్గిందని అధికారులు తెలిపారు. దేశంలో ఇలాంటి టెక్నాలజీ హైదరాబాద్‌లోనే తొలిసారి వినియోగించగా, పాతబస్తీలో ఇదే ప్రథమం అని వివరించారు.

కలాం పేరు

కలాం పేరు

ఫ్లై ఓవర్‌ను ఐటీ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ అలీ, ఎంపీ అసదుద్దీన్ ఒవైసి తోపాటు పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. 1.36 కిలోమీటర్ల పొడవైన ఈ ఫ్లైఓవర్‌పై వన్ వే రోడ్డుగా 3 లైన్లతో 12 మీటర్ల వెడల్పు కలిగి వుంది. 2018 ఏప్రిల్‌లో ఫ్లై ఓవర్ పనులు ప్రారంభం కాగా.. డిసెంబర్ 28 2021న ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఫ్లై ఓవర్ వల్ల ఆరాంఘర్‌, చాంద్రాయణగుట్ట నుంచి ఎల్బీనగర్ బైరమల్ గుడా, కర్మాన్‌ఘాట్ వైపు వెళ్లే వాహనాలకు ట్రాఫిక్ తిప్పలు తప్పాయి. ఈ ఫ్లై ఓవర్‌కి భార‌త మాజీ రాష్ట్రప‌తి ఏపీజే అబ్దుల్ క‌లాం పేరు పెట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+