శభాష్ సుధీర్ రెడ్డి.. వృద్దుడిని ఆస్పత్రిలో చేరిక.. ఖర్చు కూడా తనదే..
అసలే కరోనా.. అపై నాకెందుకులే అనే నిర్లక్ష్యం.. ఇదీ కొందరిలో కనిపిస్తోంది. మరికొందరు మాత్రం సాయం చేసేందుకు ముందుకొస్తారు. అలా మంత్రులు/ నేతలు చాలా సందర్భాల్లో సాయం చేశారు. వార్తల్లో నిలిచారు. ఇవాళ ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి.. ఆ కోవలో నిలిచారు. ఓ వృద్దుడిని ఆదుకున్నారు. ఆపన్నహస్తం అందజేసి.. ఆస్పత్రిలో చేర్చారు.
ఉదయం ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఎల్బీ నగర్ నుంచి వనస్థలిపురం వెళ్తున్నారు. ఈ క్రమంలో ఎల్బీ నగర్ ఫ్లై ఓవర్ మీద 70 ఏళ్ల వృద్దుడు అదుపుతప్పి స్కూటర్ పై నుండి కిందపడ్డాడు. అతను తీవ్ర గాయాలతో రోడ్డు మీద పడ్డాడు. అటుగా వెళుతున్న సుధీర్ రెడ్డి ఆ ఘటన చూసి , కారు దిగి వారిని తన కారులో ఎక్కించుకొని సమీప ప్రైవేటు హాస్పిటల్ చేర్పించారు.

అంతేకాదు వైద్య చికిత్సకు అయ్యే ఖర్చు కుడా తనే స్వయంగా చెల్లించాడు. అతనికి అండగా నిలిచాడు. తర్వాత వారి కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చేసిన సహాయం మరువలేనిదని ఆ వృద్దుడు, అతని కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. సుధీర్ రెడ్డికి తమ ఫ్యామిలీ రుణపడి ఉంటుందని పేర్కొన్నారు.

Recommended Video
కరోనా సమయంలో ప్రజా ప్రతినిధి సుధీర్ రెడ్డి చేసిన మంచి పని చర్చకు దారితీసింది. పలువురు అతనిని కొనియాడుతున్నారు. శభాష్ సుధీర్ రెడ్డి అంటూ ప్రశంసిస్తున్నారు.












Click it and Unblock the Notifications