ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్‌లో ఊడిన పెచ్చులు, గాయపడ్డ ఎమ్మెల్యే సునీత, సర్పంచ్‌లు
ఎప్పుడు ఎక్కడ నుంచి ప్రమాదం వస్తుందో తెలియదు. ఔను ఏ రూపంలో జరుగుతుందో తెలియదు. కొన్నిసార్లు కొందరు క్షణకాలంలో ప్రమాదాల బారి నుంచి తప్పించుకుంటారు. ఈ కోవాలో ఎమ్మెల్యే గొంగిడి సునీత కూడా చేరారు. గురువారం ఎమ్మెల్యే సునీత ప్రమాదం నుంచి సెకన్ల వ్యవధిలో తప్పించుకున్నారు. కానీ స్వల్పంగా గాయపడ్డారు.
ఆలేరు ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్‌లో సర్పంచులతో ఎమ్మెల్యే సునీత సమావేశం ఏర్పాటు చేశారు. గ్రామాల అభివృద్ధి, నిధుల సేకరణ తదితర అంశాలపై చర్చిస్తున్నారు. ప్రభుత్వ ప్రాధాన్య పథకాలను వివరిస్తున్నారు. ఇంతలో బిల్డింగ్ పెచ్చులు పలపల సౌండ్ వచ్చింది.

అక్కడున్న వారు వెంటనే బయటకు రావడంతో ప్రమాదం తప్పింది. కానీ పెచ్చులు పడి ఎమ్మెల్యే, ఇద్దరు సర్పంచ్‌లు స్వల్పంగా గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందజేశారు.

ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ నిర్మించి చాలా ఏళ్లవుతోంది. దానికి మరమ్మతు చేయించాల్సి ఉంది. కానీ దానిని అలానే వదిలేయడంతో.. ఇలా పెచ్చులు ఊడిపోతుంది. గురువారం జరిగిన ప్రమాదంలో ఎమ్మెల్యే సునీత సహా ఇద్దరు సర్పంచ్‌లు గాయపడ్డారు. అతిథి గృహానికి మరమ్మతులు చేయించాల్సిన అవసరం ఉంది. లేదంటే మరొకరు కూడా ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications