హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మోదీ బీజేపి పాలిత రాష్ట్రాల‌కే ప్ర‌ధాన మంత్రా..?తెలంగాణ నిధుల అంశంలో వివ‌క్ష ఎందుక‌న్న కేటీఆర్..!!

|
Google Oneindia TeluguNews

హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం స‌గ‌ర్వంగా అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల‌ను దేశంలోని ప‌లు రాష్ట్రాలు అభినందించండం హ‌ర్శించ‌ద‌గ్గ అంశం ఐన‌ప్ప‌టికి కేంద్ర స‌హ‌కారం మాత్రం ఏమీ లేద‌ని గులాబీ పార్టీ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్ క‌ల్వ‌కుంట్ల తార‌క రామారావు అసంత్రుప్తి వ్య‌క్తం చేసారు. తెలంగాణ ముంద‌స్తు ఎన్నిక‌ల్లో ప‌రాజ‌యం పాలైన‌ప్ప‌టికి బీజేపి అహంకార‌పూరితంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని మండి ప‌డ్డారు.

నిధుల విష‌యంలో తెలంగాణ ప్ర‌భుత్వం వివ‌క్ష చూపించ‌డం దారుణ‌మ‌ని అన్నారు. అభివ్రుద్ది విష‌యంలో రాష్ట్రానికి స‌హ‌క‌రించ‌క‌పోతే రాష్ట్రంలో బీజేపి మ‌రింత అదఃపాతాళానికి వెళ్లిపోవ‌డం ఖాయ‌మ‌ని తెలిపారు. తెలంగాణ పై స‌వ‌తి ప్రేమ చూపిస్తున్న కేంద్ర బీజేపి ప్ర‌భుత్వ వైఖ‌రిని తెలంగాణ ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌ని హెచ్చ‌రించారు.

Modi is the prime minster for BJP-ruled states only..? KTR fired on central bjp regarding funds..!!

తెలంగాణ ప్రాజెక్టుల అంశంలో స్వ‌యంగా నీతి ఆయోగ్ సిఫార‌సు చేసిన‌ప్ప‌టికి నిధుల‌ను మంజూరి చేయ‌డంలో ఎందుకు వెన‌క‌డుగు వేస్తోంద‌ని కేటీఆర్ మండిప‌డ్డారు. బీజేపి పాలిత ప్రాంతాల‌కే మోదీ ప్ర‌ధానిగా వ్య‌వ‌హ‌రించ‌డం దారుణ‌మ‌న్నారు తార‌క రామారావు. మ‌రో మూడు నెలల్లో అదికారంలో ఉంటారో , ఉండ‌రో తెలియ‌దు గాని తెలంగాణ ప్ర‌భుత్వం మాత్రం మ‌రో ఐదు సంవ‌త్స‌రాలు ప్ర‌జా క్షేత్రంలో ఉంటుంద‌ని తెలిపారు.

తెలంగాణ పథ‌కాల‌ను కాపీ చేయ‌డంలో ఉన్న శ్ర‌ద్ద నిధులు మంజూరి చేయ‌డంలో చూపించాల‌ని హిత‌వు ప‌లికారు. త‌లెంగాణ ప‌ట్ల సానుకూల ద్రుక్ప‌దంతో ఉంటే బీజెపి ప‌ట్ల ప్ర‌జ‌ల్లో ఉన్న ఆగ్ర‌హం కొంతైనా త‌గ్గుతుంద‌ని, లేక‌పోతే రాబోవు పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో బీజేపి కి డిపాసిట్ల గ‌ల్లంతు కావ‌డం ఖాయ‌మ‌ని కేటీఆర్ చెప్పుకొచ్చారు.

English summary
KTR said, Modi is the prime minister of the BJP-ruled states or entire india..? The Telangana government's discrimination in the matter of funding is a dilemma. If the BJP does not cooperate with the state in the case of the party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X